గడువులోగా రీ సర్వే | - | Sakshi
Sakshi News home page

గడువులోగా రీ సర్వే

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

గడువులోగా రీ సర్వే

విజయనగరం అర్బన్‌: జనవరి నెల నుంచి ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న రీ సర్వే, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్‌ సేతు మాధవన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తన కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వే సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రీ సర్వే, పాస్‌పుస్తకాల ముద్రణ ప్రక్రియలను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. జనవరి నుంచి కొనసాగుతున్న రీసర్వే పనులను మండల, గ్రామాల వారీగా సమీక్షించారు. సర్వే పూర్తయ్యాక సర్టిఫికెట్లు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. సర్వే అనంతరం తప్పనిసరిగా సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. 2026 జనవరి వరకు పంపిణీ చేసిన పాస్‌పుస్తకాలలో ఉన్న తప్పులను సరిచేసిర ఇవ్వాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ సీహెచ్‌.సత్తిబాబు, ఆర్‌డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

జేసీ సేతు మాధవన్‌

Advertisement
 
Advertisement
Advertisement