ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలేవీ..
జర్నలిజం ముసుగులో చంద్రబాబుకు బాకాలు
ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే బురద చల్లడం..
ఇదే రాధాకృష్ణకు తెలిసిన పాత్రికేయం
పోలీసు వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది..
ఏబీఎన్ రాధాకృష్ణ మీద మరోసారి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు
న్యూస్‌రీల్
సాక్షి, పార్వతీపురం మన్యం:
మహిళలను కించపరిచేలా, వైఎస్సార్‌సీపీ నాయకులను అవమానించేలా తన పత్రికలో జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్య లు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ పీఏసీ సభ్యురా లు పాముల పుష్పశ్రీవాణి, పార్వతీపురం, పాల కొండ నియోజక వర్గ సమన్వయకర్తలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి డిమాండ్ చేశా రు. ఇదివరకే నియోజకవర్గాల సీఐలకు ఫిర్యాదులు చేశామని గుర్తు చేశారు. ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో జిల్లా ఎస్పీ కార్యాలయంలో మరోసారి ఫిర్యాదులు అందించామని చెప్పారు. జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు కలిసి ఎస్పీ కార్యాలయానికి సోమవారం చేరుకున్నారు. ఎస్పీ మాధవ్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో.. అదనపు ఎస్పీకి నియోజకవర్గాల వారీ ఫిర్యాదు కాపీలు అందజేశా రు. పోలీసు వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని.. ఇప్పటికై నా ఏబీఎన్ రాధాకృష్ణపై కేసులు నమోదుచేయాలని కోరారు. అనంతరం మీడియాతో ఆ పార్టీ నాయకులు మాట్లాడారు. ఏబీఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు పేరిట, రోత రాతలు రాస్తున్నారని.. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యు లు, మహిళలనే లక్ష్యంగా చేసుకొని వాడలేని భాష ను ఉపయోగించి సభ్య సమాజం తలదించుకునే లా చేశారని తెలిపారు. జర్నలిజం ముసుగులో చంద్రబాబు ప్రభుత్వానికి జాకీలు లేపుతూ, గౌరవ ప్రదమైన పాత్రికేయ వృత్తి పరువు తీస్తున్నారని చెప్పా రు. నియోజకవర్గాల్లో ఫిర్యాదులు అందించినా చర్యలు లేకపోవడం వల్లే ఎస్పీ కార్యాలయ పీజీఆర్‌ఎస్‌కు వచ్చామని చెప్పారు.
కార్యక్రమంలో జెడ్పీ ఉపాధ్యక్షుడు బాపూజీ నాయుడు, పార్వతీపురం నియోజకవర్గం పరిశీలకులు మావుడి శ్రీనివాసరావు, సాలూరు నియోజకవర్గం నుంచి వంగపండు అప్పలనాయుడు, గిరి రఘు, దండి శ్రీను, రఘుపాత్రుని సాంబ, మువ్వల ఆదయ్య, మజ్జి అప్పారావు, నాలుగు నియోజకవర్గాల ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం దారుణం. మహిళల పట్ల అభ్యంతరకరంగా ఏబీఎన్ రాధాకృష్ణ కొత్త పలుకులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం మీద మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా రాధాకృష్ణ మీద కేసు పెట్టి, ఆయనను అరెస్టు చేయాలి. రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు, నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు ఆయన క్షమాపణ చెప్పాలి. రాధాకృష్ణ చేసింది తప్పు అని తెలిసినా కూడా సమర్థించే ఎమ్మెల్యేలు, మంత్రులు, మహిళా నాయకులు ఈ ప్రభుత్వంలో ఉండటం సిగ్గుచేటు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు కూడా వర్తించేలా లేవా? మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు మిమ్మల్ని అడగలేదా? రాధాకృష్ణకు ఒకటే అడుగుతున్నా.. చంద్రబాబు నాయుడు మోదీని తిడితే మీరు ఏం రాశారు? చంద్రబాబు నాయుడు మోదీని పొగిడితే మీరు జాకీలు వేయలేదా? చంద్రబాబు నాయుడు అమిత్ షా మీద రాళ్లు విసిరినప్పుడు ఆ నిర్ణయాన్ని మీరు సమర్థించలేదా? చంద్రబాబు నాయుడు అమిత్ షాను ఈరోజు జాకీలు వేస్తే మీరు ఎత్తట్లేదా? చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అని అంటే ఆ రోజు మీరు సమర్థించలేదా? తర్వాత ప్యాకేజీ వద్దు.. హోదా ముద్దు అని చంద్రబాబు అంటే ?మీరు సమర్థించలేదా? ఆయన అవునంటే అవును.. కాదంటే కాదు. మీరే వెన్నెముక లేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? మేము ఉన్నామా?
– పాముల పుష్ప శ్రీవాణి, పీఏసీ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి
పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉంది. ఆ నమ్మకంతోనే శాంతియుతంగా ఎస్పీ కార్యాలయానికి వచ్చాం. ఫిర్యాదు ఇచ్చాం. కచ్చితంగా ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మాట తప్పింది. రాజధాని విషయంలో ప్రజలను మభ్యపెడుతోంది. వారి లోపాలను ఎత్తి చూపే, ప్రశ్నించే వైఎస్సార్ సీపీ, జగన్ మోహన్ రెడ్డి మీద ఏదో విధంగా దాడి చేయాలి. పార్టీ క్యాడర్ ను కించపరిచి బలహీనం చేసే కుతంత్రమే ఇది. రాధాకృష్ణ, ఆ తప్పులను సమర్థించే చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ వంటివారంతా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
– పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ
ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో అభివృద్ధి ఎలా ఉంది? పాలన ఎలా ఉంది? సంక్షేమం ఎలా ఉంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం రాధాకృష్ణకు లేదు. అందుకే ప్రభుత్వానికి వత్తాసు పాడుతున్నారు. మా పార్టీలో ఉన్న టువంటి నాయకులను, మహిళలను కించపరిచేలా మాట్లాడటం దురదృష్టకరం. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారు? జగన్‌మోహన్‌రెడ్డిని ఇలా వ్యక్తిగతంగా దూషిస్తూ వ్యక్తిత్వ హననానికి ఎందుకు పాల్పడుతున్నారు? ఈరోజు ప్రజలకు న్యాయం చేసేటువంటి పరి స్థితి ఉందా? వీటన్నిటిని ప్రశ్నించే దమ్ము ధైర్యం మీకు ఉందా? వీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు గానీ, వీరి చర్యలు గానీ ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారు. ప్రతి ఒక్క మహిళ కూ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి. – విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ నియోజకవర్గం


