అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Apr 28 2026 7:59 AM | Updated on Apr 28 2026 7:59 AM

అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ● జిల్లాలో 263 ఖాళీలు రీ–సర్వే పనుల్లో వేగం పెంచాలి రాజన్నదొరకు కళావతి పరామర్శ రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించడం లేదు ● ఐటీఘే ఏపీఓకు ఫిర్యాదు

పార్వతీపురం రూరల్‌: రాష్ట్రంలో అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం మొదటి దశలో 2,646 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఖాళీగా ఉన్న 263 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. కలెక్టర్‌ అధ్యక్షతన గల కమిటీ నియామకాలు చేపడుతుంది.

జిల్లాలో ఖాళీల వివరాలు: మొత్తం 263 పోస్టుల్లో 5 అంగన్‌వాడీ కార్యకర్తలు, 258 సహాయకురాళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐటీడీఏ పార్వతీపురం పరిధిలో అత్యధికంగా 175 పోస్టులు, సీతంపేట పరిధిలో 57, పార్వతీ పురం డివిజన్‌ పరిధిలో 31 పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా సంబంధిత గ్రామం/ వార్డులో నివసించే వివా హిత మహిళలై ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్హత, వయోపరిమితి కలిగి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల్లో సమర్పించాలని అధికారులు సూచించారు.

పార్వతీపురం: జిల్లాలో జరుగుతున్న భూ రీ– సర్వే పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో తహసీల్దార్‌లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ రీసర్వే ద్వారా భూ రికార్డు ల ప్రక్షాళన జరిగి రైతులకు శాశ్వత హక్కులు లభిస్తాయని పేర్కొన్నారు. సర్వే పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ జాప్యం లేకుండా పూర్తి చేయాలని, వివాదాలను పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు. ఆధునిక పరికరాలు, డ్రోన్ల ద్వారా సేకరించిన డేటాను కచ్చి తంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆయన పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించా రు. సమావేశంలో రెవెన్యూ అధికారులు, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

సాలూరు: మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరను పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పరామర్శించారు. ఇటీవల రాజన్నదొర నేత్ర శస్త్ర చికిత్స చేసుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం రాజన్నదొరను సాలూరు పట్టణంలోని ఆయన స్వగృహంలో కళావతి కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

సీతంపేట: ఉప్పరజమ్మి నుంచి రేగుమానుగూడ వరకు రూ.50 లక్షలతో చేపట్టిన రోడ్డు పనుల్లో నాణ్యత పాటించడం లేదని హడ్డుబంగి మాజీ సర్పంచ్‌ సూర్యారావు, మంగయ్య తదితరులు ఆరోపించారు. ఈ మేరకు ఫొటోల తో ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబుకు సోమ వారం ఫిర్యాదు చేశారు. వాటరింగ్‌ సక్రమంగా చేయడం లేదని, రోడ్డు లెవెలింగ్‌ సరిలేదన్నా రు. సిమెంట్‌ మోతాదు పాటించడం లేదని, అస్తవ్యస్తంగా రోడ్డు పనులు చేస్తున్నా ఇంజినీరింగ్‌ అధికారులు పర్యవేక్షించడం లేదన్నారు. ఇలా నిర్మిస్తే రోడ్డువేసిన కొద్ది రోజులకే పాడ య్యే ప్రమాదం ఉందన్నారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement