గింజ మొలవదు.. ధర రాదు! | - | Sakshi
Sakshi News home page

గింజ మొలవదు.. ధర రాదు!

Mar 24 2026 7:07 AM | Updated on Mar 24 2026 7:07 AM

–8లో గింజ మొలవదు.. ధర రాదు!

న్యూస్‌రీల్‌

కావేరి సీడ్స్‌తో రైతులు నష్టపోయారు..

కొనుగోలు కేంద్రాలతో మద్దతు కల్పించండి

–8లో

మొక్కజొన్నను ముంచేసిన ‘కావేరి’

దిగుబడి లేక నష్టపోతున్న రైతాంగం

పంటను నమ్ముకున్న రైతులపై ముప్పేట దాడి

మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026

సాక్షి, పార్వతీపురం మన్యం:

రైతులు రూ.వేలు పెట్టుబడి పెట్టి.. పంటకు ఉపక్రమించారు. ‘మా సీడ్స్‌ వేసుకుంటే.. ఎకరాకు మూడున్నర టన్నుల దిగుబడి వస్తుంద’ని ఓ విత్తన సంస్థ మాటలను నమ్మి సాగుచేశారు. పైగా.. ఏడాదికి ఎరువులు, పురుగు మందు ఖర్చూ తామే భరిస్తామంటే ఆశ పడ్డారు. పంట చేతికొచ్చాక గానీ.. బోధపడలేదు. తామెంత మోసపోయామో అని! జిల్లాలో ఈ సీజన్‌లో మొక్కజొన్న పండించిన రైతులు నిలువునా దగా పడ్డారు. ఇటు ప్రభుత్వపరంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక యంత్రాంగం బొమ్మ చూపించగా.. అటు విత్తన సరఫరా సంస్థ నకిలీ విత్తనాలతో దిమ్మ తిరిగేలా చేసింది. మరోవైపు అనుకోని అతిథిలా కొద్దిరోజులుగా వస్తున్న గాలివాన.. చేతికొచ్చిన కొద్ది పంటపైనా దెబ్బ కొడుతోంది.

కండెలు సిద్ధం.. గింజలే లేవు...

జిల్లాలో మొక్కజొన్న పండిస్తున్న రైతులు తీవ్ర నష్టానికి, కష్టానికి గురవుతున్నారు. రబీ సీజన్‌లో సుమారు 31 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగచేయగా, అధిక శాతం మంది రైతులు కావేరి సీడ్స్‌ సరఫరా చేసిన విత్తనాలనే వినియోగించారు. సీజన్‌కు ముందు సంస్థ ప్రతినిధులు.. వీటిని వినియోగిస్తే, ఎకరాకు మూడు నుంచి మూడున్నర టన్నుల వరకు జొన్న పంట దిగుబడి వస్తుదందని చెప్పారు. సంవత్సరానికి ఎరువులు, పురుగు మందులకు సరిపడా మొత్తం రూ.35 వేలు తామే ఇస్తామని రైతులను నమ్మించారు. పంట కూడా కొనుగోలు చేసి తీసుకెళ్తామని ఒప్పందం చేసుకున్నారు. తీరా.. పంట చేతికి వచ్చిన తర్వాత పుష్కలంగా కండైలెతే వచ్చాయి గానీ, ఎక్కడా గింజలు లేవు. అప్పటికి గానీ.. నకిలీ విత్తనాలతో నష్టపోయామని రైతులు గ్రహించలేకపోయారు. ఎరువు లు, మందులకు అవసరమైన డబ్బులు కూడా ఇవ్వలేదని పలువురు రైతులు చెబుతున్నారు. మక్కువ మండలం సరాయివలస, కొమరాడ మండలం కల్లికోట, గుణానపురం, గంగరేగువలస, దుగ్గి కంభవలస, సోమినాయుడువలస, పాలకొండ తదితర ప్రాంతాల్లో ఇదే రకం సీడ్స్‌తో పంట వేశారు. ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కానరాని కొనుగోలు కేంద్రాలు

మరోవైపు ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటాకు రూ.2,400గా ప్రకటించింది. పంట చేతికి అందొస్తున్నా.. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఊసులేదు. మరోవైపు గాలి, వర్షాలు పంటపై ప్రభావం చూపుతున్నాయి. దళారులు సిండికేట్‌గా మారి రూ.1,600 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లోనూ వర్షాల వల్ల పంట నష్టం జరిగిందనే సాకు పెట్టి, క్వింటా రూ.800 నుంచి రూ.1,400లోపే రైతుల వద్ద దళారులు కొనుగోలు చేశారు. మరలా ఆ పరిస్థితి పునరావృతం కానీయకుండా చూడాలని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు.

కావేరి సీడ్స్‌తో జొన్న పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. గింజలు రావడం లేదు. జిల్లాలో సుమారు 20 వేల ఎకరాలకుపైగా ఈ సీడ్స్‌తోనే పంట ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు సర్వే చేయాలి. జొన్న పంటకు ఎకరాకు రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలి. కావేరి సీడ్స్‌పై చర్యలు తీసుకోవాలి. సీడ్స్‌ ప్రతినిధులు రైతులను బెదిరిస్తున్నారని తెలుస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు.

– బంటు దాసు,

జిల్లా కార్యదర్శి, రైతు సంఘం

జిల్లాలోని అన్ని మండలాల్లోనూ రైతులు మొక్కజొన్న విరివిగా సాగు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు సిండికేట్‌గా మారి, రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర రూ.2,400 ఉంటే.. రూ.1,600కే విక్రయించాల్సి వస్తోంది. తక్షణమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవాలి.

– బుడితి అప్పలనాయుడు,

జిల్లా సమితి కార్యదర్శి,

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement