జనగణన పారదర్శకంగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

జనగణన పారదర్శకంగా చేపట్టాలి

Mar 24 2026 7:07 AM | Updated on Mar 24 2026 7:07 AM

పార్వతీపురం: జనగణన–2027 పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో జనగణన 2027 సన్నాహకాల్లో భాగంగా ఫీల్డ్‌ట్రైనర్ల శిక్షణను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జనగణన దేశ భవిష్యత్‌ ప్రణాళికలకు అత్యంత కీలకమైన ప్రక్రియగా పేర్కొన్నారు. శిక్షణ పొందుతున్న ఫీల్డ్‌ ట్రైనర్లు క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నా రు. నిర్దేశించిన సమయంలోగా ఎన్యుమరేటర్లు తమ విధులను పూర్తిచేసేలా ఫీల్డ్‌ ట్రైనర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా మాస్టర్‌ ట్రైనీలు ఫీల్డ్‌ ట్రైనర్లకు జనగణనపై పలు సూచనలు, జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్‌ కుమార్‌రెడ్డి, డీఆర్‌ఓ కె. హేమలత, తదితరులు ఉన్నారు.

11ఏళ్ల ఆస్తి వివాదానికి పరిష్కారం

గత 11 ఏళ్లుగా కుటుంబ సభ్యుల ఆస్తుల పంపకం పరిష్కారంకాక కోర్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న కేసును లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లో పరిష్కారం చూపినట్టు కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు. 2015లో హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన కె.ఎల్లప్పదొర మరణించిన తరువాత ఆయన ఇద్దరు భార్యలు, పిల్లలు ఆస్తుల పంపకంలో కోర్టులు, పోలీస్‌ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతూ మానసికంగా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను ఆశ్రయించడంతో న్యాయవాదులు, అధికారులు సమస్య తీవ్రతను గుర్తించి ఇరువర్గాల వారికి నచ్చజెప్పి న్యాయపరంగా వాటాలను దఖలు పరిచేలా చేశారన్నారు..

ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయం కావాలి

ప్రజారోగ్యాన్ని పరిరక్షణలో అధికారులు రాజీపడకూడదని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించాలన్నారు. ఒక్క టైఫాయిడ్‌ కేసు కూడా నమోదు కాకుండా వైద్యారోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఫ్యామిలీ ముస్తాబు కార్యక్రమాలను పర్యవేక్షించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement