● ఎమ్మెల్సీల ఆకాంక్ష
● బొత్స సత్యనారాయణను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల బృందం
విజయనగరం: శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆదివారం పరామర్శించారు. నగరంలోని బొత్స నివాసంలో ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలిసిన వారు ఆయన క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ తలశిల రఘురాం మాట్లాడుతూ ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లో అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని తామంతా ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. విజయనగరం ప్రజల ఇలవేల్పు పైడితల్లమ్మ ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉన్నారని.. సంతోషంగా ఉందన్నారు. గతంలో మాదిరి మరింత ఆరోగ్యంగా ఉంటూ తమకు మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్షించారు. అంతకు ముందు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బొత్స సత్యనారాయణను పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, వరుదు కళ్యాణి, కల్పలతా రెడ్డి, డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, పాలవలస విక్రాంత్, కుంభా రవిబాబు, టి.మాధవరావు, కెఆర్‌జె.భరత్, రమేష్ యాదవ్, బొమ్మి ఇస్రాయిల్, రూహుతలా, సిపాయి సుబ్రహ్మణ్యం, పి.చంద్రశేఖర్ రెడ్డి, నర్తు రామారావు, టి.మాధవరావు, ఇందుకూరి రఘురాజు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కెకె.రాజు, పార్టీ నాయకులు కాయల వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.


