రబీలో రాగిదే పెత్తనం.. | - | Sakshi
Sakshi News home page

రబీలో రాగిదే పెత్తనం..

Mar 23 2026 8:53 AM | Updated on Mar 23 2026 8:53 AM

రబీలో రాగిదే పెత్తనం.. చికెన్‌ బ్రాయిలర్‌ లైవ్‌ డ్రెస్‌డ్‌ స్కిన్‌లెస్‌ శ్రీ160 శ్రీ330 శ్రీ340

గోమాతకు సీమంతం..
చికెన్‌

నియోజకవర్గంలో 659 హెక్టార్లలో సాగు

ఒక్క రాజాం మండలంలో 520 హెక్టార్లలో సాగవుతున్న చోడి

క్వింటా ధర రూ. 3500

ఆశాజనకంగా సాగు

భీమసింగి వేణుగోపాలస్వామి ఆలయలో గోమాతకు ఆదివారం సీమంతం ఘనంగా నిర్వహించారు. భక్తులు గోవుపై వస్త్రాలు ఉంచి పసుపు, కుంకుమలు రాసి శాస్త్రోక్తంగా వేడుకను జరిపారు. – జామి

రాజాం: నియోజకవర్గ వ్యాప్తంగా గత రబీ సీజన్‌లో మొక్కజొన్న పంట సాగు అధికంగా కనిపించేది. ఒకానొక సమయంలో రబీ సాగు అంటేనే మొక్కజొన్నగా ఉండేది. చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం రబీలో సాగుచేసిన మొక్కజొన్న పంటకు దళారీలే దిక్కుగా మారారు. గతంలో క్వింటా మొక్కజొన్న ధర రూ. 2400 ఉండగా, ఇప్పుడు 1800 రూపాయలకు పడిపోయింది. దీంతో చాలామంది రైతులు మొక్కజొన్న సాగుకు స్వస్తి పలికి, రాగి సాగుపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆరోగ్య అవసరాల రిత్యా రాగి పిండి వినియోగం పెరిగింది. మార్కెట్‌లో పిండి ధర అధికంగా ఉంది. రైతు పండించే పంటకు మంచి ధర వస్తుండడంతో రాగిపంట సాగు మండలంలో అధికమైంది.

నియోజకవర్గంలో 659 హెక్టార్లలో..

గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది నియోజకవర్గంలో రాగి పంట సాగు కనిపిస్తోంది. మొత్తం 659 హెక్టార్లలో ఈ పంట సాగుచేయగా, అత్యధికంగా రాజాం మండలంలో 520 హెక్టార్లలో సాగవుతోంది. రాగి పంట కాలం 75 రోజులు కాగా, పెట్టుబడి చాలా తక్కువుగా ఉంటుంది. ఎకరా సాగుకు 200 రూపాయల విత్తనాలు, ఒక యూరియా బస్తా సరిపోతుంది. ఇతర ఎరువులు, పురుగు మందుల అవసరం ఉండదు. పంట ప్రారంభ దశలో మినహా ఈ పంటకు సాగునీరు అవసరం లేదు. నియోజకవర్గ పరిధిలో చాలా చోట్ల ఇప్పటికే రాగుల పంట కోతలు కూడా పూర్తయ్యాయి. ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా రూ. 3100 నుంచి 3500 రూపాయల మధ్య కొనుగోలు చేస్తున్నారు. పెద్దగా పెట్టుబడి అవసరం లేని రాగి పంట రబీలో రైతుకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.

నువ్వు పంటదీ అదే రూటు..

నియోజకవర్గ పరిధిలో రబీ సీజన్‌లో రాగి పంటతో పాటు పలుచోట్ల నువ్వు పంట వేశారు. రాజాం, సంతకవిటి మండలాల్లో ఈ పంట అధికంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో 72 హెక్టార్లలో ఈ పంట సాగులో ఉంది. నువ్వుల పెట్టుబడి నామమాత్రం కాగా, ఎకరా సాగులో నువ్వు పంట ద్వారా రైతుకు రూ. 15 వేల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement