న్యూస్‌రీల్
● నిర్లక్ష్యం..!
జిల్లా కేంద్రానికే తలమానికం.. వేలాది మంది క్రీడాకారుల కలల వేదిక.. రాజకీయ, ప్రభుత్వ సభలకు కేరాఫ్ అడ్రస్. కానీ, నేడు ఆ ప్రాంగణం అస్తవ్యస్తంగా మారి మైదానానికి వచ్చేపోయే వారిని వెక్కిరిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం కొద్దిపాటి వర్షానికే చిన్నపాటి చెరువును తలపిస్తోంది. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మైదానంలో సుమారు 25 శాతం మేర నీరు నిలిచిపోవడంతో క్రీడాకారులు, వాకర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మైదానంలోని ఒక పక్క భాగం పూర్తిగా జలమయమైంది. ముఖ్యంగా ఖోఖో క్రీడకు కేటాయించిన ప్రాంగణం నీట మునిగింది. వ్యాయామం చేసే స్తంభాలు ఉన్న ప్రాంతం కూడా బురదమయంగా మారింది. నిలిచిన నీరు బయటకు పోయే దారి లేక దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో మైదానానికి వచ్చే క్రీడాకారులు, విశ్రాంతి కోసం వచ్చే పలువురు ఆ వాసన భరించలేక ముక్కున వేలేసుకుంటున్నారు. అక్కడ నిలువలేక వెనుదిరుగుతున్నారు.
– పార్వతీపురం రూరల్
చెరువును తలపిస్తున్న మైదానం
మైదానంలో ఓ మూలన అధ్వానంగా ఉన్న గుంత


