ఏనుగుల తరలింపు ఎప్పుడు? | - | Sakshi
Sakshi News home page

ఏనుగుల తరలింపు ఎప్పుడు?

Mar 21 2026 5:13 AM | Updated on Mar 21 2026 5:13 AM

జియ్యమ్మవలస రూరల్‌: చేతికొచ్చిన పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. జియ్యమ్మవలస మండలంలోని నిమ్మలపాడు, బిత్రపాడు, బాసంగి గ్రామాల్లో రెండు రోజులుగా సంచరిస్తూ అరటి, చెరకు, జొన్న, పామాయిల్‌ పంటలను నాశనంచేస్తున్నాయి. రాత్రి వేళల్లో గ్రామ పరిసరాల్లో సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. కుంకీ ఏనుగులను తీసుకొచ్చి ఏనుగులను తరలిస్తామంటూ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఓట్లకోసం ఉచిత హామీలు ఇవ్వడం సరికాదని, ఏనుగుల తరలింపుపై దృష్టిసారించి రైతులకు మేలుచేయాలని డిమాండ్‌ చేశారు. బిత్రపాడు, నిమ్మలపాడు గ్రామాల ప్రధాన రోడ్డుకు దగ్గరలో ఏనుగులు సంచరించడంతో అటువైపుగా ప్రయాణించిన వాహన చోదకులు, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రాత్రివేళల్లో నిద్ర లేకుండా చేస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement