● అవసరం మేరకు మాత్రమే బుకింగ్ చేసుకోవాలి
● గ్యాస్ పొదుపుగా వాడుకోవాలి ● కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం: జిల్లాలో గృహవినియోగ గ్యాస్‌కు కొరత లేదని, డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా జరుగుతుందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. గ్యాస్ కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని, డిమాండ్‌కు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రజల అవసరం మేరకు మాత్రమే గ్యాస్ కొనుగోలు చేయాలని, ఆందోళన చెంది అనవసరంగా బుకింగ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. డిమాండ్, సప్లయిలో అంతరాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సివిల్ సప్లయి అధికారులను అదేశించారు. సమావేశంలో సీపీఓ, డీఎస్‌ఓ పాల్గొన్నారు.


