రేగిడి: మండల పరిధి కొ మెర గ్రామానికి చెందిన బొత్స మనోహర్‌నాయు డు ఈ నెల 19న విడుద లైన గేట్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 59వ ర్యాంకు సాధించి చక్కని ప్రతిభ కనబరిచాడు. ఈ యన తల్లి గృహిణి కాగా తండ్రి బొత్స వెంకటరమ ణ ప్రధానోపాధ్యాయులు గా విధులు నిర్వహిస్తున్నారు. మనోహర్‌నాయుడును ఎంఈఓ ఎంవీ ప్ర సాదరావు, ఉపాధ్యాయ సంఘాలు, గ్రామస్తులు అభినందించారు.
శివ్వాం యువకుడు ప్రతిభ
వంగర: మండల పరిధి శివ్వాం గ్రామానికి చెందిన కోడూరు సత్యనారాయణ నాయుడు గేట్ ఫలితాల్లో సత్తా చాటాడు. జియాలజీ అండ్ జియో ఫిజిక్స్ విభాగంలో పరీక్ష రాయగా ఆల్ ఇండియా స్థాయిలో 722 ర్యాంకుతో 329 స్కోర్ పాయింట్లు సాధించాడు. సత్యనారాయణ ప్రస్తుతం విజయనగరం ఎం.ఆర్ కాలేజీలో జియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప నిచేస్తున్నాడు. గేట్‌లో సత్తా చాటడడంతో పలువురు అభినందించారు.


