పోలీసు సమస్యల పరిష్కారానికి ‘వెల్ఫేర్‌ డే’ | - | Sakshi
Sakshi News home page

పోలీసు సమస్యల పరిష్కారానికి ‘వెల్ఫేర్‌ డే’

Mar 21 2026 5:13 AM | Updated on Mar 21 2026 5:13 AM

పోలీసు సమస్యల పరిష్కారానికి ‘వెల్ఫేర్‌ డే’

పార్వతీపురం రూరల్‌ : జిల్లా పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న శాఖాపరమైన, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిస్తామని ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన పోలీసు వెల్ఫేర్‌ డే (గ్రీవెన్స్‌ డే) నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది తమ విన్నపాలను ఎస్పీకి నేరుగా అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది నుంచి అందిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా బదిలీలు, ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విన్నపాలు అధికంగా వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ సీసీ సంతోష్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement