విజయనగరం క్రైమ్: ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగ జరుపుకోవాలని వన్‌టౌన్ సీఐ ఆర్వీకే చౌదరి సూచించారు. శనివారం రంజాన్ పురస్కరించుకుని, ముస్లిం మతపెద్దలు, ముస్లిం సోదరులతో జిల్లా కేంద్రంలో శుక్రవారం సమావేశమై పలు సూచనలు చేశారు. మత సామరస్యానికి ప్రతీక అయిన రంజాన్ వేడుకలు అంతటా అందరూ కలసిమెలసి సంతోషంగా చేసుకోవాలని తెలిపారు. ఎటువంటి తగాదాలు జరగకుండా చూసుకోవాలని, ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే మత పెద్దలు, శాంతి కమిటీల సభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వన్టౌన్ ఎస్‌ఐలు రవి, కమల్ భార్గవ్, లీలావతి, లక్ష్మీప్రసన్నకుమార్, సురేంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు.


