వైద్యశాఖలో కుర్రపెత్తనం! | - | Sakshi
Sakshi News home page

వైద్యశాఖలో కుర్రపెత్తనం!

Feb 22 2026 8:16 AM | Updated on Feb 22 2026 8:16 AM

వైద్యశాఖలో కుర్రపెత్తనం!

వైద్యశాఖలో కుర్రపెత్తనం!

వైద్యశాఖలో కుర్రపెత్తనం!

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా వైద్య శాఖ నీరసిస్తోంది. గాడిలో పెట్టే సరైన చికిత్స ఇక్కడ అవసరమైనప్పటికీ.. కొంతమంది వల్ల శాఖ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ముఖ్యంగా ఇక్కడ పని చేసేందుకు సీనియర్లు ఎవరూ మొగ్గు చూపడం లేదు. వద్దాం అనుకున్న వారిని సైతం.. కొంతమంది కోటరీగా మారి, అడ్డుకుంటున్నారన్న ప్రచారం ఉంది. ఇక్కడ జూనియర్లతో జట్టు కట్టి.. నచ్చినట్లుగా వ్యవహరించవచ్చన్న ధోరణి కొద్ది రోజులుగా కనిపిస్తోంది. ఫలితంగా జూనియర్ల పెత్తనం ఎక్కువై, శాఖకు అపకీర్తి వస్తోందంటూ వైద్యవర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.

అడ్మినిస్ట్రేషన్‌లోకి రాని సీనియర్లు

జిల్లాలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలుగా పని చేసేందుకు కూడా సీనియర్లు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలోకి రావడానికి అయిష్టంగా ఉంటున్నారు. సీనియర్‌ వైద్యుల్లో చాలా మందికి సొంతంగా ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. భార్యభర్తలు వైద్యులుగా ఉంటే.. వారిలో ఒకరు ప్రభుత్వ వైద్యశాలలో పని చేస్తున్నా.. రెండో వారు సాంతంగా ప్రైవేట్‌ ఆస్పత్రి పెట్టుకుంటున్నారు. సమీపంలోనే నివాసం ఉండటానికి ప్రయత్నిస్తున్నారు గానీ.. బాధ్యత గల పోస్టుల్లోకి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే పార్వతీపురం, సాలూరు తదితర ప్రాంతాల్లో ప్రైవేట్‌ క్లినిక్‌లు నడుపుకొంటున్న ప్రభుత్వ వైద్యుల సంఖ్య పెరుగుతోంది.

జూనియర్లతో జట్టు..

కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచన, అనుభవం అవసరమైనప్పటికీ.. సీనియర్లను నియమించేందుకు కూడా ఉన్నతాధికారులు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. కేవలం తమ మాటే చెల్లుబాటు అయ్యేలా జూనియర్లతో ‘కూటమి’ కట్టి.. తప్పులు చేయిస్తున్నట్లు వినికిడి. అర్హతకు మించి సీట్లలో కూర్చోవడంతో జూనియర్‌ వైద్యులు సైతం ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇలానే ఎన్‌హెచ్‌ఎం పోస్టుల భర్తీలో ఓ జూనియర్‌ వైద్యాధికారి మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. తన సోదరుడికి పోస్టు కట్టబెట్టేందుకు అర్హత ఉన్న వ్యక్తులను పక్కనపెట్టారన్న ప్రచారం ఉంది. ఆయన వల్ల నష్టపోయిన ఓ బాధితుడు.. తనకు జరిగిన అన్యాయంపై ఇప్పటికీ పోరాటం చేస్తున్నాడు. పీజీఆర్‌ఎస్‌లో పదేపదే వినతిపత్రాలు అందిస్తున్నాడు. న్యాయం మాత్రం జరగడం లేదు. పలు పనులకు సంబంధించి బిల్లుల స్వాహా విషయంలోనూ ఆ జూనియర్‌ అధికారి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి ఉదంతాలు అనేకం శాఖలో వినిపిస్తున్నాయి.

అనర్హులకు అందలం

ఉన్నత పదవుల్లో జూనియర్లు

ప్రైవేట్‌ ఆస్పత్రులకే సీనియర్‌ వైద్యాధికారుల మొగ్గు

సేవల మందగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement