విపత్తులపై అవగాహనే ప్రధానం | - | Sakshi
Sakshi News home page

విపత్తులపై అవగాహనే ప్రధానం

Apr 4 2026 9:49 AM | Updated on Apr 4 2026 9:49 AM

విపత్తులపై అవగాహనే ప్రధానం

డెంకాడ: విపత్తుల సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహనతో ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చని విపత్తు నిర్వహణ 5వ ఏపీఎస్పీ బెటాలియన్‌ విపత్తు ప్రతిస్పందన దళం ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ అన్నారు. చింతలవలస ఎంవీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుకునే పద్ధతులను చంద్రశేఖర్‌ వివరించారు. 25 మంది దళం సభ్యులు తుఫాన్‌, వరదలు వంటి విపత్తు సమయాల్లో ఉపయోగించే వివిధ పరికరాలు, పద్ధతులను ప్రయోగాత్మకంగా వివరించారు. నదులు, సముద్రాల్లో చిక్కుకునేవారిని రక్షించే పద్ధతులను తెలియజేశారు. ఉరుములు, మెరుపులు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు, రైలు ప్రమాదాల సమయాల్లో భద్రతా చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌లు జి.శివప్రసాద్‌, కె.భాస్కరరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ పీఓ ఎన్‌.షణ్ముఖరావు, జి.ఆంజనేయులు, వలంటీర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement