● కార్మికులగోడు వినండి బాబూ...
మున్సిపాలిటీల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు రూ.9వేల నుంచి రూ.16వేలు మాత్రమే ఇస్తున్నారు.. బతకడం కష్టమవుతోంది.. లేబర్ హాలిడేస్, సిక్, క్యాజువల్ లీవులు, వీక్లీ ఆఫ్ వంటి కనీస హక్కులు అమలు కావడం లేదంటూ ప్లాంటేషన్, స్ట్రీట్ లైట్, వాటర్ ట్యాంకుల వాల్ ఆపరేటర్లు, పంపు హౌస్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ విజయనగరంలోని గాంధీ పార్క్ వద్ద శనివారం ఆందోళన చేశారు. ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపారు. తక్షణమే అసెంబ్లీలో చర్చించి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రెగ్యులర్ కార్మికులతో సమానంగా బేసిక్ వేతనం, పెన్షన్, గ్రాట్యూటీ, ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఈ నెల 23న మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తామని, 24న విజయవాడలో జరిగే నిరసనకు సిద్ధం కావాలని కార్మికులకు యూనియన్ జిల్లా కార్యదర్మి ఎ.జగన్మోహన్‌రావు పిలుపునిచ్చారు.
– విజయనగరం గంటస్తంభం


