ఆస్పత్రులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి

Feb 22 2026 8:16 AM | Updated on Feb 22 2026 8:16 AM

ఆస్పత్రులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి

ఆస్పత్రులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి

డీఎంహెచ్‌ఓ ఎస్‌.భాస్కరరావు

కొమరాడ: వైద్యం కోసం వచ్చే రోగులకు అహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఆస్పత్రులను తీర్చిదిద్దాలని డీఎంహెచ్‌ఓ ఎస్‌.భాస్కరరావు వైద్యాధికారులను ఆదేశించారు.

కూనేరు రామభద్రపురం, కొండకోనేరు, తుమ్మలవలస, కొమరాడ పీహెచ్‌సీల్లో శనివారం తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రిలో బయట, లోపల పరిశుభ్రతపై ఆరాతీశారు. అనంతరం అందరితో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అపరిశుభ్రమైన పరిసరాలు వ్యాధులకు మూలకారణమని, ప్రతీ ఒక్కరు తమ పరిసరాలను చెత్తాచెదారం నిల్వనీరు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కార్యక్రమంలో నోడల్‌ అధికారి జగన్‌మోహన్‌రావు, ప్రొగ్రాం అధికారి సూర్యకౌశిక్‌, వైద్యాధికారి దేవేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement