భోజనం రుచిని ఏమెనూ చెప్పాలి..! | - | Sakshi
Sakshi News home page

భోజనం రుచిని ఏమెనూ చెప్పాలి..!

Feb 21 2026 7:05 AM | Updated on Feb 21 2026 7:05 AM

భోజనం

భోజనం రుచిని ఏమెనూ చెప్పాలి..!

భోజనం రుచిని ఏమెనూ చెప్పాలి..! 106 పెంచాల్సింది వారే..

సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల సంఖ్య

మూడు నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య

పౌష్టికాహారం అందడం లేదు

106

హాస్టల్‌ భోజనం.. అ‘ధన’పు భారం!

నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా పెరగని మెస్‌చార్జీలు

మెనూ అమలుకు ఆపసోపాలు

సీతంపేట: ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జేబునిండా సొమ్ముతీసుకెళ్తే సంచినిండా సరుకులు రాని పరిస్థితి. ఈ స్థితిలో గిరిజన సంక్షేమ విద్యాసంస్థలకు మెస్‌చార్జీలను పెంచడంలో చంద్రబాబు ప్రభుత్వ అలసత్వం మెనూ అమలుపై ప్రభావం చూపుతోంది. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం వసతిగృహ సంక్షేమాధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. కొన్నిచోట్ల కొసరికొసరి వడ్డిస్తుండగా, మరికొన్ని చోట్ల వసతిగృహాల్లో డిప్యూటీ వార్డెన్‌ ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది.

జిల్లాలోని సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల పరిధిలో 106 గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, వసతిగృహాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 23 వేల మంది విద్యార్థులు 3 నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. వారంలో ఆరు రోజులపాటు కోడిగుడ్డు ఇస్తున్నారు. వంద మంది విద్యార్థులు ఉన్నచోట ఆరు రోజులకు 600ల కోడిగుడ్లు అవసరం. ప్రస్తుతం మార్కెట్‌లో గుడ్డు ధర రూ.7 పైనే ఉంది. ప్రభుత్వం కేటాయించింది మాత్రం రూ.5 ప్రకారం కోడిగుడ్లపై రూ.1200లు దాకా అదనంగా పెట్టుకోవాలి. పది మందికి కేజీ చొప్పున 10 కేజీలు చికెన్‌ అవసరం. వారానికి రెండుసార్లు (ఆదివారం మధ్యాహ్నం, మంగళవారం రాత్రి) పెడుతున్నారు. వంద మంది విద్యార్థులున్న హాస్టల్‌కు 20 కేజీలు కావాలి. ప్రస్తుతం కేజీ చికెన్‌ రూ.250 పైన ఉంది. కానీ ప్రభుత్వం కేటాయించింది రూ.140. అంటే ఒక కేజీకి రూ.110 దాకా అదనం. 20 కేజీలకు రూ.2,200లకు పైగా పెట్టుకోవాలి. గ్యాస్‌ సిలెండర్‌ గతంలో 680 ఉండేది. ఈ రోజు రవాణా ఖర్చుతో కలిపితే రూ.990 దాకా ఉంటోంది. వందమంది విద్యార్థులున్న హాస్టల్‌కు నెలకు కనీసం పది సిలండర్‌లు అవసరం. అంటే రూ.3,100 అదనంగా పెట్టాల్సిన దుస్థితి. ఇంకా నిత్యావసర సరుకులు కందులు, మినపగుళ్లు వంటి ధరలు గతంతో పోలిస్తే ఆకాశన్నంటుతున్నాయి. విద్యా సంవత్స రం మరో రెండు నెలల్లో ముగియనుంది. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం పై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

మెస్‌చార్జీలు రూ.1400, రూ.1600..

ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులకు మెస్‌చార్జీలు నెలకు రూ.1400లు ఇస్తుండగా కళాశాల హాస్టల్‌ విద్యార్థులకు రూ.1600లు చెల్లిస్తున్నారు. అంటే స్కూల్‌ విద్యార్థులకు రోజుకు రూ.16.66 కళాశాల విద్యార్థులకు రూ.56.33 ఇస్తున్నారు. ఈ మొత్తంతో ఉదయం పౌష్టికరమైన టిఫిన్‌, స్నాక్స్‌, సాయంత్రం స్నాక్స్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టడం సాధ్యమేనా అని పలువురు విద్యార్థి సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే మెస్‌ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మెనూ చార్జీలు పెంచడం అనేది గిరిజన సంక్షేమ సెక్రటరీ స్థాయిలో జరగాలి. అన్ని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను ఎప్పటికప్పుడు సందర్శించి మెనూ సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. విద్యార్థులకు పోషకాహారంతో కూడి ఆహారాన్ని అందిస్తున్నాం.

– అన్నదొర, ట్రైబుల్‌ వెల్ఫేర్‌ డీడీ, సీతంపేట

23,000

పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులకు సరిపడా పోషకాహరం అందడం లేదు. విద్యార్థులు రక్తహీనత, ఇతర వ్యాధులతో సతమతమవుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒకసారి మెనూ పెంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకసారి కూడా మెనూ చార్జీలు పెంచకపోవడంతో అరకొర ఆహారం విద్యార్థులకు అందుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలి. – టి.అఖిల్‌,

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయకార్యదర్శి

భోజనం రుచిని ఏమెనూ చెప్పాలి..! 1
1/2

భోజనం రుచిని ఏమెనూ చెప్పాలి..!

భోజనం రుచిని ఏమెనూ చెప్పాలి..! 2
2/2

భోజనం రుచిని ఏమెనూ చెప్పాలి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement