వైఎస్సార్‌సీపీలోకి పలగర యువత
బలిజిపేట: మండలంలోని పలగర గ్రామానికి చెందిన యువకులు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి ఆయన పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో సచివాలయాల నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు, వలంటీర్ల వ్యవస్థతో సంక్షేమ పథకాల అమలు భేష్‌గా జరిగేదన్నారు. లంచాల వ్యవస్థ ఉండేది కాదన్నారు. కులాలు, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ లబ్ధికలిగేదని తెలిపారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆ పరిస్థితి లేదన్నారు. సంక్షేమం, అభివృద్ధిని పక్కనపెడితే ఏ వర్గానికి ఎటువంటి మేలు జరగడం లేదన్నారు. గ్రామంలో చాలామంది అర్హులు ఉన్నా పింఛన్ మంజూరుకాని పరిస్థితి నెలకొందన్నారు. అందుకే వైఎస్సార్‌సీపీలో చేరామని తెలిపారు. జగనన్న, జోగారావు ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పారు. పార్టీలో చేరినవారిలో ఎస్.శశికుమార్, జి.వెంకటేష్, కె.శ్రీను, శివ, ఎస్.ప్రసాద్, కె.రవి, కూర్మారావు, నారాయణరావు, పి.రవి, కె.రవి, పి.నారాయణరావు, తదితరులు ఉన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ఉత్సాహంగా పనిచేయాలని ఈ సందర్భంగా యువకులకు మాజీ ఎమ్మెల్యే జోగారావు సూచించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ సముచిత స్థానం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పి.మురళీకృష్ణ, ఎంపీపీ నాగమణి, జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్, ఎంపీటీసీ సభ్యురాలు రామకృష్ణమ్మ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ మండల ట్రేడ్‌యూనియన్ అధ్యక్షుడు సత్యనారాయణ, కె.సత్యంనాయుడు, టి.రాజేంద్ర, జి.శ్రీనివాసరావు, ఎస్.వెంకటరమణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


