ప్రతిఒక్కరూ సన్మార్గంలో నడవాలి
నెల్లిమర్ల రూరల్: ప్రతిఒక్కరూ ప్రతికూల భావాలు విడిచి, సన్మార్గంలో నడవాలని అందులోనే నిజమైన భక్తి దాగి ఉందని ఏఎంసీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు అంబళ్ల శ్రీరాములునాయుడు అన్నారు. శివరాత్రి పురస్కరించుకుని, మండలంలోని ఒమ్మి గ్రామంలో బ్రహ్మకుమారీస్ ధ్యాన మందిరంలో శాంతి జెండా ఆదివారం ఎగురవేశారు. శివరాత్రి అనేది కేవలం ఉపవాసం, పూజలకే పరిమితం కాకుండా మనసును పవిత్రంగా మార్చుకునే రోజు అని అభిప్రాయపడ్డారు. బ్రహ్మకుమారీస్ బోధించే రాజయోగ ధ్యానం ద్వారా మనసు ప్రశాంతమై సన్మార్గంలో నడించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అందరూ రోజులో ఎంతో కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయిస్తే దైవానుగ్రహంతో పాటు మానసిక ప్రశాంతత లభ్యమవుతుందన్నారు.


