పడక దొరకదు.. | - | Sakshi
Sakshi News home page

పడక దొరకదు..

Dec 8 2025 8:08 AM | Updated on Dec 8 2025 8:08 AM

పడక ద

పడక దొరకదు..

మెరుగైన సేవలు అందిస్తున్నాం..

న్యూస్‌రీల్‌

కిటకిటలాడుతున్న వార్డులు.. చాలని మంచాలు

సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

స్కానింగ్‌ జరగదు...

పార్వతీపురం రూరల్‌: అమ్మోరు గండం గట్టెక్కినా.. చలి జ్వరం చంపేసినట్టుంది పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రి పరిస్థితి. బోర్డు మారింది.. భవనం రంగు మారింది.. జిల్లా ఆసుపత్రిగా స్థాయి పెరిగింది. కానీ, ఆ స్థాయికి తగ్గట్టుగా వైద్యులను, సిబ్బందిని పెంచడంలో మాత్రం పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. ఉన్న వైద్యులు అదనపు పని భారంతో సతమతమవుతుంటే.. కొత్త నియామకాలు చేపట్టాల్సిన వైద్యవిధాన పరిషత్‌ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఫలితంగా ఆసుపత్రికి వచ్చే వందలాది మంది రోగులకు సకాలంలో వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తోందని ప్రకటనలకే పరిమితమైందా? అన్న అనుమానాలు క్షేత్ర స్థాయి పరిస్థితులు చూస్తే కలుగుతున్నాయి.

రేడియాలజిస్ట్‌ పోస్టు ఖాళీ..

ఆసుపత్రిలో స్కానింగ్‌ యంత్రాలు ఉన్నప్పటికీ, వాటిని నిర్వహించే రేడియాలజిస్ట్‌ పోస్టు గత రెండేళ్లుగా ఖాళీగా ఉండటం గమనార్హం. దీనివల్ల స్కానింగ్‌ సేవలు నిలిచిపోయాయి. ఉన్న ఇతర వైద్యులు ఓపీ, వార్డు సేవల్లో బిజీగా ఉండటంతో స్కానింగ్‌ కోసం పేద రోగులు ప్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఉచితంగా జరగాల్సిన పనికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని, ఆసుపత్రిని సేవలు నిమిత్తం సంప్రదింపులు చేస్తున్న ప్రజలు, గిరిజనులు వాపోతున్నారు. పోస్టును భర్తీ చేయడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

కీలక విభాగాల్లోనూ అదే తీరు..

ఆసుపత్రి నిర్వహణలో అతి ముఖ్యమైన నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పోస్టు కొన్ని ఏళ్లుగా భర్తీకి నోచుకోలేదు. అలాగే రోగుల సంఖ్యకు అనుగుణంగా ఉండాల్సిన హెడ్‌ నర్సులు లేరు. ఉన్న కొద్ది మంది నర్సులే అటు వార్డులు, ఇటు ఎమర్జెన్సీ సేవలు చూసుకోవాల్సి రావడంతో వారికి పనిభారం తడిసి మోపెడవుతోంది. మరోవైపు మైక్రో బయాలజీ విభాగంలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ లేకపోవడంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కొంత జాప్యం జరుగుతోంది.

ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్న వైనం

పూర్తి స్థాయి ఆర్‌ఎంవో లేకపోవడంతో, ప్రస్తుతం మహిళా వైద్యురాలు ఒకరు ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పరిపాలనా వ్యవహారాలు, వైద్య సేవలు రెండూ ఒకరే చూడాల్సి రావడంతో ఒత్తిడి పెరుగుతోంది. ఇక అత్యవసరమైన ఐసీయూ విభాగంలో ప్రత్యేక నిపుణులు, సిబ్బంది ఉండాలి. కానీ, ఆ పోస్టులు ఖాళీగా ఉండటంతో సాధారణ డ్యూటీలో ఉన్న వైద్యులే ఐసీయూ బాధ్యతలను కూడా భుజాన వేసుకోవాల్సి వస్తోంది. ఇలా ఒకే వైద్యుడు పలు విభాగాలు చూడాల్సి రావడంతో ఏ ఒక్కరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారనే ఆవేదన వైద్య వర్గాల్లోనూ ఉంది.

జిల్లా కేంద్ర ఆసుపత్రికి వచ్చే రోగులకు వీలైనంత మేరకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న వైద్యులు, సిబ్బందితోనే సమన్వయం చేసుకొని నిరంతరాయంగా సేవలందుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. రేడియాలజి సేవలందించే వైద్యులు పదోన్నతిపై ఇక్కడకు రావల్సి వుంది. ఎమర్జెనీ, ఐసీయూ సహా అన్ని విభాగాల్లో సేవలు సక్రమంగానే కొనసాగుతున్నాయి.

– డాక్టర్‌ జి.నాగభూషణరావు,

జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి,

పార్వతీపురం మన్యం

ప్రజారోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదనడానికి ఈ ఆసుపత్రే నిలువెత్తు నిదర్శనం. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రధానంగా వైద్యం చేసే చేతులు కావాలి. అవసరమైన వైద్యులను, పారా మెడికల్‌ సిబ్బందిని నియమించకుండా జిల్లా ఆసుపత్రి అని బోర్డు తగిలిస్తే ప్రయోజనం ఏముంటుంది? ఇప్పటికై నా సంబంధిత శాఖామాత్యులు, అధికారులు స్పందించి.. యుద్ధ ప్రాతిపదికన ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ఉన్న సిబ్బందిపై పనిభారం తగ్గించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

జిల్లా ఆసుపత్రిలో రోగులకు తప్పని అవస్థలు

నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం

రెండేళ్లుగా ఖాళీగా రేడియాలజిస్ట్‌ పోస్టు

150 పడకల ఆసుపత్రికి.. 250 మంది ఇన్‌పేషెంట్లు!

ఆర్‌ఎంవోతో సహా నాలుగు ప్రధాన కుర్చీలు ఖాళీ

ఐసీయూ సహా 3 కీలక విభాగాల్లో డాక్టర్ల కొరత

ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న వసతులకూ, వస్తున్న రోగుల సంఖ్యకూ ఏమాత్రం పొంతన కుదరడం లేదు. ప్రతీ రోజూ ఓపీకి 300 మందికి తగ్గకుండా జనం వస్తుండగా, నిత్యం 150 నుంచి 250 మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. కానీ అక్కడ ఉన్నది మాత్రం 150 పడకలే. ఉన్న మంచాలు నిండిపోయి, కొత్త రోగులకు చోటు లేక.. ఒక మంచంపై సర్దుబాటు చేస్తూ చికిత్స పొందాల్సిన దుస్థితి నెల కొంది. పడకల సంఖ్య పెంచకపోవడంతో, ఉన్న సిబ్బందిపైనే రోగుల ఒత్తిడి పెరిగి సేవల్లో నాణ్యత లోపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పడక దొరకదు.. 1
1/2

పడక దొరకదు..

పడక దొరకదు.. 2
2/2

పడక దొరకదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement