వసారాలే తరగతులు.. సమస్యలే పాఠాలు
తల్లికి వందనం పేరిట చదువుకున్న ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. మొదటి ఏడాది పూర్తిగా పథకం ఎగ్గొట్టేయగా.. రెండో ఏడాదిలోనూ వేలాదిమందిని పథకానికి దూరం చేసింది. ఇచ్చిన రూ.15 వేలలోనూ తగ్గించారు. పాఠశాల నిర్వహణ కోసమని రూ.2 వేలు చొప్పున కోత పెట్టారు. జిల్లాలో మొదటి విడతగా 1,08,951 మందికి పథకం వర్తింపజేశారు. వీరికి పాఠశాల నిర్వహణ కోసమని కోత పెట్టిన నిధులన్నీ కలిపినా.. చాలా స్కూళ్లలో మరుగుదొడ్లు, తాగునీటి అవసరాలను తీర్చవచ్చు. ఆ నిధులు ఏమవుతున్నాయో అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పార్వతీపురం మండలం రావికోన ప్రభుత్వ పాఠశాలలో కుక్కల మధ్యనే విద్యార్థుల భోజనం
సాక్షి, పార్వతీపురం మన్యం :
ఈ చిత్రంలోని మహిళలంతా సాలూరు మండలం కొత్తవలస గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లులు. తమ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలని గత సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు వచ్చి వినతిపత్రం అందించారు. పాఠశాలలో 45 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరుగుదొడ్లు లేక.. పిల్లలంతా రోడ్డు దాటి ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. పాఠశాల భవనం కూడా శిథిలావస్థకు చేరుకుందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువు
అసంపూర్తిగా
నాడు–నేడు పనులు
ఆవేదనలో విద్యార్థులు


