ఏనుగుల సమస్యకు పరిష్కారం ఏదీ?
దశాబ్దానికిపైగా ఈ ప్రాంతాన్ని ఏనుగులు పట్టి పీడిస్తున్నాయి. పంట, ఆస్తి, ప్రాణ నష్టాలతో కలవపెడుతున్నాయి. శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. కుంకీ ఏనుగులు అదిగో ఇదిగో అంటున్నారు గానీ.. ఇప్పటికీ జిల్లా ముఖం చూడలేదు. జిల్లాలో రెండు గుంపులు నాగావళి, వంశధార తీర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం, పార్వతీపురం, భామిని మండలాల్లో సంచరిస్తూ.. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎలిఫెంట్ జోన్ అంటూ చేస్తున్న ప్రకటన గడప దాటడం లేదు.


