పూర్తిచేసేదెన్నడు?
సీతానగరం మండలం నిడగల్లు ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో నాడు–నేడు కింద ప్రారంభించి, తర్వాత కాలంలో మధ్యలోనే నిలిచిపోయిన అదనపు భవన నిర్మాణమిది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు పథకం కింద జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. తొలిదశలో 486 పాఠశాలల్లో రూ.130.14 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. మౌలిక సదుపాయాలు కల్పించారు. రెండోవిడతలో రూ.144.51 కోట్లతో 535 పాఠశాలల్లో ఆధునికీకరణ పనులు జరిపారు. ఈలోగా ప్రభుత్వం మారడంతో ఏడాదిన్నర కాలంలోనే బడి గతి మారిపోయింది. నాడు–నేడు పనులు ఇదిగో ఇలా అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.


