నిబంధనల అడ్డంకి! | - | Sakshi
Sakshi News home page

నిబంధనల అడ్డంకి!

Nov 3 2025 6:44 AM | Updated on Nov 3 2025 6:44 AM

నిబంధ

నిబంధనల అడ్డంకి!

చర్యలు తీసుకుంటాం.. తగ్గిన దిగుబడి పంట మార్పిడి చేసుకోవాలి సూచనలు పాటించాలి

పంట నష్ట పరిహారానికి

పార్వతీపురం రూరల్‌:

జిల్లా రైతాంగాన్ని మోంథా తుఫాన్‌ కోలుకోలేని దెబ్బతీసింది. చేతికొచ్చిన పంట కళ్లేదుటే నీటిపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పైరు నేలకు ఒరుగుతుంటే రైతుల కళ్లల్లో కన్నీటి సుడులు తిరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 3.10 లక్షల రైతుల ఈ క్రాప్‌ వివిధ పంటలకు సంబంధించి నమోదు కాగా, జిల్లా వ్యాప్తంగా కేవలం 815.45 ఎకరాలు మాత్రమే నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాధమికంగా లెక్క కట్టినట్టు చెబుతున్నారు. పార్వతీపురం మండలంలో సుమారు 19వేల ఎకరాలకు సంబంధించిన వరి పంటలో 70శాతం వరకు తుఫాన్‌ కారణంగా దెబ్బతింటే జిల్లా వ్యాప్తంగా అధికారులు చెబుతున్న లెక్కలు ఒకింత రైతులను ఆందోళనకు గురి చేస్తుంది. నిబంధనల పేరిట నష్టాన్ని లెక్కించడంలో అధికారులు అనుసరిస్తున్న వైఖరి పరిహారం దక్కకుండా చేస్తుందేమోనన్న భయాందోళనలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.

అంచనాల్లో సెంట్ల మెలిక

తుఫాన్‌ నష్టంపై అధికార యంత్రాంగం నివేదికలను సిద్ధం చేసే పనిలో భాగంగా వ్యవసాయ శాఖ, రెవెన్యూ సిబ్బంది జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాల్సి వుంది. అయితే నష్టాన్ని గుర్తించే ప్రక్రియ రైతులకు శాపంగా మారుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఇన్ని సెంట్లు దాటితేనే, 33శాతం దెబ్బతింటేనే పరిహారానికి అర్హులంటూ అధికారులు పెడుతున్న మెలిక అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తుంది. కళ్ల ఎదుటే పంట మొత్తం తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్నా.. పాక్షికంగా నష్టం జరిగిన ఈ సెంట్ల నిబంధన కారణంగా తాము సాయం కోల్పోతామేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం సదరు నష్టపోయిన పంట నష్టం కిందకు రాదని అధికారులు చెబుతున్న మాటలు రైతులను కలచివేస్తున్నాయి. ప్రభుత్వం తన నిబంధనలను సరళతరం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

నిబంధనల ప్రకారం నష్ట పరిహారం అందించేందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తుఫాన్‌ వల్ల నష్టపోయిన పంట వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రక్రియ పూర్తయిన వెంటనే పరిహారం కోసం అర్హులైన రైతులకు చెల్లించేందుకు నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తాం. ప్రభుత్వ నిబంధనల పరిధిలోనే ఈ పరిహారం చెల్లింపులు ఉంటాయి. – రాబర్ట్‌పాల్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

పత్తి రైతు చిత్తు

మోంథా తుఫాన్‌తో విలవిల

అధిక వర్షాలకు దెబ్బతిన్న పత్తి

అందుబాటులో లేని కొనుగోలు కేంద్రాలు

గిట్టుబాటు ధర కోసం పాట్లు

జిల్లాలో 17,202 ఎకరాల్లో సాగు

భామిని: జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న పత్తిపై మోంథా తుఫాన్‌ పంజా విసిరింది. తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట చేనులో నీరు నిల్వ ఉండి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే కాయ, పింజైపె వర్షాల ప్రభావం పడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా పత్తి రైతుకు తీరని నష్టం సంభవించింది. ఇదిలా ఉండగా వర్షాలతో తడిచిన పత్తి కొనుగోలుకు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ ఏడాది 17,202 ఎకరాల్లో పత్తి సాగును అధికారులు గుర్తించారు.

వరుస కష్టాలు..

ఈ ఏడాది పత్తి రైతులను వరుస కష్టాలు వెంటాడాయి. కాపు దశలో ఉన్న పత్తి పంటపై వరుస వర్షాలు తీవ్ర ప్రభావం చూపి రైతు ఆశలపై నీళ్లు చల్లాయి. ఎకరానికి 3 నుంచి నాలుగు క్వింటాళ్ల దిగుబడి పడిపోయింది. పత్తి మొదటి కాపు వర్షార్పణం అయ్యింది. చేతికి అందాల్సిన విలువైన పత్తి గిడసబారి నల్లబడింది. ఈ సమయంలో రైతులు సేకరించిన పత్తిని ఆరబోయడం, కాయ పత్తి సేకరించి తొక్కలు తొలగించే ప్రయత్నాల్లో తలమునకలయ్యారు.

అధిక నాణ్యత, బరువు రావలసిన మొదటి తీత పత్తి దెబ్బతిని తీవ్రంగా నష్టం కలిగింది. అదనపు కూలీలతో కాయపత్తి తీయించాల్సి ఉంది. ఎకరానికి మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకు నష్టపోతున్నాం. దీంతో ఎకరానికి రూ.20 వేల వరకు నష్టం సంభవించే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక గిట్టుబాటు ధర లేదు. పండించిన రైతుకు మద్దతు లేదు.

– కొత్తకోట చంద్రశేఖర్‌, పత్తి రైతు, సొలికిరి, భామిని మండలం

పత్తి పంట నిరంతరం సాగు చేస్తుండడంతో భూ సారం తగ్గుతుంది. పంట దిగుబడి పడిపోతుంది. ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గుతుంది. పంట దిగుబడి తగ్గి ఖర్చులు పెరుగుతున్నాయి. నష్టాల బారిన పడుతున్న తరుణంలో పంట మార్పిడి చేసుకోవాలి. నష్టాల నుంచి బయట పడాలి.

– కొల్లి తిలక్‌, ఎంఏవో, భామిని

తుఫాన్‌ అనంతరం పత్తి రైతుకు సూచనలు అందిస్తున్నాం. శాస్త్రవేత్తలు రైతులతో ఇష్టాగోష్టి జరిపి చైతన్య పరుస్తున్నారు. పంట దిగుబడి తగ్గకుండా చర్యలు వివరిస్తున్నాం. పంటలో నీరు తీసి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముడి పత్తి నాణ్యత తగ్గకుండా ఆరవేత పనులు చేపట్టాలి.

– రాబర్ట్‌పాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

జిల్లాలో 3.10 లక్షల మంది రైతుల ఈ క్రాప్‌ నమోదు

మోంథా తుఫాన్‌కు 330 హెక్టార్లలో పంట నష్టం

నివేదికలు సిద్ధం చేస్తున్న యంత్రాంగం

నష్టాన్ని గుర్తించడంలో అధికారుల చర్యలపై రైతుల్లో ఆందోళన

నిబంధనల అడ్డంకి! 1
1/4

నిబంధనల అడ్డంకి!

నిబంధనల అడ్డంకి! 2
2/4

నిబంధనల అడ్డంకి!

నిబంధనల అడ్డంకి! 3
3/4

నిబంధనల అడ్డంకి!

నిబంధనల అడ్డంకి! 4
4/4

నిబంధనల అడ్డంకి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement