పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ల్యాబ్‌లు..!
వైద్య శాఖ రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వాహణ అనధికారికంగా నిర్వహిస్తున్న రెండు ల్యాబ్‌లను గుర్తించిన అధికారులు జిల్లాలో రిజిస్ట్రేషన్ అయిన ల్యాబ్‌లు 72 క్లినిక్‌లు 128
రెండు ల్యాబ్‌లను గుర్తించాం..
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలో అనధికారికంగా పలు మెడికల్ ల్యాబ్‌లు దర్జాగా నిర్వహిస్తున్నారు. వీటి సంఖ్య పదుల్లోనే ఉండొచ్చని వైద్య శాఖాధికారులే చర్చించుకోవడం విశేషం. కొన్ని క్లినిక్‌లకు కూడా ఎటువంటి అనుమతులు లేకున్నా దర్జాగా నిర్వహించేస్తున్నారు. ఇటువంటి ల్యాబ్‌లు, క్లినిక్‌లలో రోగులకు సంబంధించిన రిపోర్టుల్లో తేడాలు వస్తే ఎవరిది బాధ్యత అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేగాక తేడాలొచ్చిన రిపోర్టుల మేరకు వైద్యాధికారి సలహాలతో మందులు వాడి ప్రాణాల మీదకు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది.
జిల్లాలో రిజిస్టర్ ల్యాబ్‌లు 72
జిల్లాలో 72 ల్యాబ్‌లు వైద్య ఆరోగ్య శాఖ వద్ద రిజిస్ట్రర్ అయ్యాయి. అదేవిధంగా 149 ఆస్పత్రులు రిజిస్ట్టర్ చేసుకున్నాయి. క్లినిక్‌లు 149 ఉన్నాయి. డెంటల్ క్లినిక్‌లు 68 ఉన్నాయి. ఫిజియోథెరిపి క్లినిక్‌లు 10 ఉన్నాయి.
పుట్టగొడుగుల్లా..
మెడికల్ ల్యాబ్, ఆస్పత్రి, క్లినిక్, ఫిజియోథెరపి క్లినిక్ ఇలా ఏదైనా కానివ్వండి.. నిర్వహించాలంటే వైద్య ఆరోగ్య శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అయితే కొందరు తమ పలుకుబడితో ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండానే వీటిని తమ ఇష్టానుసారం నిర్వహిస్తూ రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇలా రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్న ల్యాబ్‌లు, క్లినిక్‌లలో ఏదైనా ప్రమాదం జరిగితే బీమా వర్తించదు. దీని వల్ల రోగులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో రోగులకు సంక్రమించిన వ్యాధుల రిపోర్టుల్లో తేడాలొస్తే అడిగే నాధుడు ఉండడు. రిజిస్టర్ ల్యాబ్ అయితే ఏది తేడా చేసినా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే వైద్య పరీక్షల పేరిట వీటిలో రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనధికార ల్యాబ్‌లు, క్లినిక్‌లపై చర్యలు తీసుకోవడంలో వైద్య శాఖాధికారులు మీనమేషా లు లెక్కిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తు న్నాయి. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సంబంధిత శాఖ అధికారులు ఇలా వ్యవహరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రజల ప్రాణాలంటే అంత లెక్క లేకుండా పోయిందా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రోగుల ప్రాణాల ను లెక్కలోకి తీసుకుని ఇటువంటి ల్యాబ్‌లు, క్లినిక్ ల విషయంలో సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
భోగాపురం మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా మెడికల్ ల్యాబ్ నిర్వహిస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం రావడంతో
ఆకస్మికంగా తనిఖీ చేసి నోటీస్ జారీ చేశారు.
విజయనగరం పట్టణంలో ఓ వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖ వద్ద ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ల్యాబ్ నిర్వహిస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం
రావడంతో తనిఖీ చేసి సదరు వ్యక్తికి నోటీస్ జారీ చేశారు.
జిల్లాలో ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న రెండు ల్యాబ్‌లను గుర్తించాం. సంబంధిత యజమానులకు నోటీసులు కూడా ఇచ్చాం.అనధికారికంగా ల్యాబ్‌లు, క్లినిక్‌లు నిర్వహిస్తే తగు చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్‌వో
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ల్యాబ్‌లు..!


