
మహిళల ఆర్థికస్వావలంబన పెంపుదలే లక్ష్యం
విజయనగరం టౌన్: మహిళల్లో ఆర్థికస్వావలంబన పెంపొందించడమే లక్ష్యంగా అఖిలభారత డ్వాక్రా బజార్, సరస్‌ను ఏర్పాటుచేశామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎక్స్‌అఫీషియో సెక్రటరీ, సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వాకాటి కరుణ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక మాన్సాస్ గ్రౌండ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన డ్వాక్రాబజార్, సరస్ ఎగ్జిబిషన్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె స్వయం సహాయక సంఘ సభ్యులు ఏర్పాటుచేసిన వివిధ స్టాల్స్‌ను పరిశీలించి, వారితో మమేకమయ్యారు. మహిళల సృజనాత్మకత, శ్రమ, నైపుణ్యాలను ప్రోత్సహించే దిశగా ఇటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేశామన్నారు. ఎన్నోరకాల తయారీ ఉత్పత్పులు ప్రదర్శనలో అందుబాటులో ఉంచడం అభినందనీయని ప్రశంసించారు. కార్యక్రమంలో సెర్ప్ హెచ్‌ఆర్ డైరెక్టర్ కల్యాణ్ చక్రవర్తి, సీ్త్రనిధి మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్, వెలుగు ఏపీడీ సావిత్రి, పీడీ రత్నాకర్, సరస్ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, డీపీఎంలు రాజ్‌కుమార్, చిరంజీవి, లక్ష్మునాయుడు, సీతారాం తదితరులు పాల్గొన్నారు.
సెర్ప్ సీఈఓ కరుణ