
రేబిస్ వ్యాధితో వ్యక్తి మృతి
● భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు
● కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
సంతకవిటి: మండలంలోని గోవిందపురం గ్రామానికి చెందిన అదపాక లింగంనాయుడు(37) రేబిస్ వ్యాధితో సోమవారం మృతిచెందాడు. ఆయనకు ఆగస్టు 30న కుక్క కరవడంతో సంతకవిటి పీహెచ్‌సీకి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఇటీవల అనారోగ్యం బారిన పడడంతో శనివారం శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లగా రేబిస్ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించి, మెరుగైన చికిత్స కోసం వైజాగ్ రిఫర్ చేయడంతో ఆదివారం వైజాగ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈయన మృతితో గ్రామస్తులు భయాందోళన చెంది గ్రామంలో కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.