పీపీపీ.. డుండుండుం..! | - | Sakshi
Sakshi News home page

పీపీపీ.. డుండుండుం..!

Sep 27 2025 5:03 AM | Updated on Sep 27 2025 7:51 AM

పీపీప

పీపీపీ.. డుండుండుం..!

పైడితల్లి పండగకూ పీపీపీ దెబ్బ

ఆనందగజపతి ఆడిటోరియానికి నిర్లక్ష్యపు గ్రహణం 

ప్రైవేటుకు ఇచ్చేందుకు ప్రయత్నం

సాక్షి ప్రతినిధి విజయనగరం: తల్లి బికినీ వేసుకుని పబ్బుకు వెళ్తే.. పిల్ల మాత్రం వోణీ వేసుకుని వ్రతానికి ఎందుకు వెళ్తుంది?.. తండ్రి బార్‌ షాపు దగ్గర ఉంటే బాబు బెల్ట్‌ షాపు దగ్గరకు పోకుండా ఎందుకుంటాడు.. అన్న పూల చొక్కాతో గరివిడి లచ్చిమి డ్యాన్స్‌ చూడ్డానికి వెళ్తే తమ్ముడు మాత్రం అన్నమయ్య కీర్తనలు ఎందుకు పాడతాడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పీపీపీ అంటూ మెడికల్‌ కాలేజీ ఆస్తులు ప్రైవేటుకు ఇచ్చేస్తుంటే.. ఇక తమ్ముళ్లు.. పార్టీ నేతలు మాత్రం ఎందుకు ఆగుతారు. వాళ్లు కూడా పీపీపీ.. డుం..డుం..డుం అంటూ మేళం.. తాళం కొడుతూ ఆయన దారిలోనే నడుస్తున్నారు. నడిస్తే నడిచారు.. అంతా కలిపి పైడితల్లమ్మ జాతరను సైతం కంగాళీ చేసేశారు. పట్టణంలో ఉన్న ఒకే ఒక్క కళాక్షేత్రం ఆనందగజపతి ఆడిటోరియంను కూడా పీపీపీకి ఇచ్చేసి లక్ష్యంతో నిర్లక్ష్యంగా విడిచిపెట్టేశారు.

వైభవానికి పాతరేసి...
పట్టణంలో ఏ పెద్ద కళా కార్యక్రమం జరిగినా ఆశ్రయం ఇచ్చేది ఆనందగజపతి ఆడిటోరియం ఒక్కటే. రాష్ట్ర స్థాయి నాటకాలు, నాటికలు.. రంగస్థల పోటీలు.. సాంస్కతిక కార్యక్రమాలు ఏవి జరిగినా ఇక్కడే. ఉడా ఆధ్వర్యంలో ఉన్న ఆడిటోరియం ఏసీతో మంచి సీట్లతో కళకళలాడేది. ఇక పైడితల్లి పండగ సందర్భంగా మూడురోజులూ అక్కడ నిరంతరాయంగా కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. పిల్లల నృత్యాలు.. కళారూపాలు.. ఏకపాత్రాభినయం.. ఇలా రకరకాల కార్యక్రమాలతో కళాక్షేత్రం కళకళలాడేది. వందలమంది కూర్చుని ఆ కార్యక్రమాలు తిలకించేవారు. కానీ ఇప్పుడు ఆ ఆడిటోరియం కళావిహీనంగా తయారైంది. కాదు కాదు.. పాలకులు దానిని శిథిలావస్థకు చేర్చేశారు. వాస్తవానికి ఈ పండగ ముందు కాస్తో కూస్తో బాగుచేసి.. కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా అందంగా తీర్చి దిద్దేవారు. 

సీట్లు.. ఏసీ.. ఇతరత్రా మరమ్మతులు చేపట్టి.. పండగకు సిద్ధం చేసేవారు. ఇక ఆడిటోరియం ప్రాంగణం కూడా చెత్తా చెదారం లేకుండా శుభ్రం చేసేవారు. కానీ ఇప్పుడు దానిని పూర్తిగా పాడుబెట్టేశారు. అదేంటి ఈసారి పండగకు అక్కడ ప్రోగ్రామ్‌లు లేవా అంటే.. లేవండి.. దానిని ఇలా శిథిలం చేసేశాక అభివృద్ధికోసం ప్రైవేటు వ్యక్తులకు ఇస్తారట. కాబట్టి.. దానికి మరి రిపేర్లు గట్రా ఏం లేవని అధికారుల నుంచి సమాధానం వస్తోంది. డెవలప్మెంట్‌ అంటే మొత్తం ఈ ఆనందగజపతి ఆడిటోరియం ప్రాంగణాన్ని ప్రైవేటుకు ఇచ్చేసి దాన్ని బహుళ అంతస్తుల భవనంగా మార్చి పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తారన్నమాట. ఎలా గూ రేపోమాపో నోట్లో తులసినీళ్లు పోసేసేవాడికి మందులు ఎందుకు అని మంచం దించేసినట్లు ఇప్పు డు ఆడిటోరియంను అలా వదిలేశారు. దీంతో కుర్చీ లు చెదలుపట్టి విరిగిపోగా ప్రాంగణం మొత్తం తాగు బోతులకు అడ్డాగా మారింది. ఎటు చూసినా మద్యం సీసాలు.. చెత్తా చెదారంతో భయానకంగా మారింది.

మరి ఈసారి ప్రోగ్రాములు ఎక్కడ ?
పట్టణానికి పెద్దదికై ్కన ఆనందగజపతి (ఏజీ) ఆడిటోరియం లేకపోవడంతో ఈ సారికి గురజాడ గ్రంథాలయం ప్రాంగణాన్ని సాంస్కృతిక కార్యక్రమాలకు వినియోగిస్తారని అంటున్నారు. ఇక్కడ కేవలం వేదిక మాత్రమే భవనం కాగా మిగతా ఆహుతులు కూర్చునే జాగా అంతా ఖాళీ. ఎండలో.. వానలో ఉండాలి. అసలే ఇది ఏకధాటిగా వానలు కురుస్తున్న రోజులు. అలాంటపుడు ఈ మూడు రోజుల్లో కార్యక్రమాలు ఎలా అనే ప్రశ్న వస్తోంది. అయితే.. ఏముంది లెండి.. ఏదోలా నడిపేసి మమ అనిపించేద్దాం.. కుదిరితే టెంట్లు వేద్దాం.. అప్పటికి ఎలా ఉంటుందో .. బడ్జెట్‌ బట్టి చూద్దాం.. అనే సమాధానం అధికారుల నుంచి వినిపిస్తోంది. మొత్తానికి నగరంలోని ఒక్కో చారిత్రక ఆధారాలు మెల్లగా చెరిగిపోతూ.. పీపీపీ పేరిట కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి. మొన్న సింహాచలం మేడ, ఆ మొన్న ఎమ్మార్‌ ఆస్పత్రి ప్రాంతం, నేడు.. ఏజీ ఆడిటోరియం.. అంతా పీపీపీ మాడ్యూల్‌. నాయకుడి బాటలోనే తెలుగు తమ్ముళ్లు.. చెల్లెళ్లు నడుస్తున్నారు.

 

పీపీపీ.. డుండుండుం..! 1
1/3

పీపీపీ.. డుండుండుం..!

పీపీపీ.. డుండుండుం..! 2
2/3

పీపీపీ.. డుండుండుం..!

పీపీపీ.. డుండుండుం..! 3
3/3

పీపీపీ.. డుండుండుం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement