
పౌష్టికాహార లోపం నివారణకు చర్యలు
పార్వతీపురం: జిల్లాలోని ఐసీడీఎస్ కేంద్రాల్లో రక్తహీనతగల చిన్నారులు, గర్భిణులతో పాటు వయస్సుకు తగిన ఎత్తు, బరువులేని చిన్నారులను గుర్తించి వారికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ‘తిండి లేదు..కండ కలగదు’ శీర్షిక సాక్షి దినపత్రికలో ఈనెల 25న వెలువడిన కథనంపై ఆమె స్పందించారు. గర్భిణులకు పౌష్టికాహరం లోపం నివారణకు ప్రతి మొదటి, మూడవ శుక్రవారాల్లో టీహెచ్‌ఆర్ సరఫరా చేసి, వైద్యులతో పీరియాడికల్ తనిఖీలను నిర్వహించడంతోపాటు ఎనిమియా తగ్గించేందుకు ఐఎఫ్‌ఏ మాత్రలు కూడా అందిస్తున్నామన్నారు. కలెక్టర్ ఆదేశాలమేరకు పిల్లల వైద్య నిపుణుల ద్వారా నెలలో రెండుసార్లు ఎదుగుదల లోపం ఉన్న పిల్లలను పరీక్షించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ

పౌష్టికాహార లోపం నివారణకు చర్యలు