
మహాలక్ష్మి నమోస్తుతే...
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమార్చన జరిపారు. సాలూరు పట్టణంలోని కామాక్షి అమ్మవారిని కరెన్సీనోట్లతో ఆలయ కమిటీ సభ్యులు అలంకరించారు. జ్ఞానసరస్వతీదేవి మహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. మక్కువ మండలం శంబర గ్రామంలో కొలువైన శంబర పోలమాంబ అమ్మవారు భక్తులుకు మహాలక్ష్మి రూపంలో దర్శనమివ్వగా, ఈఓ బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితుడు కె.శ్రీనివాస్‌శర్మ చండీ సహిత శ్రీఫలహోమాన్ని జరిపారు.
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మవారు మహలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయం ఆవరణలో ఉదయం నుంచి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఘటాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించారు.
– మక్కువ/సాలూరు /పాలకొండ

మహాలక్ష్మి నమోస్తుతే...