
ఆ రెండు వర్గాల ఫ్లెక్సీలపైనే అక్కసు..
కేవలం బీజేపీ.. జనసేన నేతల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు మాత్రమే ఎత్తేసి కార్పొరేషన్ సిబ్బంది వ్యాన్లలో పడేస్తున్నారు. మున్సిపల్ అధికారులు.. కమిషనర్ తదితరులు కేవలం టీడీపీకి విధేయత చూపిస్తే చాలనుకుంటున్నారని.. అందుకే మా ఉనికి కూడా పట్టణంలో ఉంచడం లేదని జనసేన క్యాడర్ వాపోతోంది. ఇక బీజేపీ వారు అయితే మున్సిపల్ కమిషనర్‌ను కలిసి తమ ఫ్లెక్సీలు తొలగింపు మీద ఆవేదన.. ఆక్రోశం వెళ్లగక్కడం మినహా ఏమీ చేయలేకపోయారు. ప్రధాని బర్త్‌డేకు ఫ్లెక్సీలు పెట్టినా వెంటనే తీసేస్తున్నారని బయటకు ఏడవలేక.. ఎవరికీ చెప్పుకోలేక.. అదోరకమైన భావనలోకి వెళ్లిపోయారు. టౌన్‌లో కేవలం టీడీపీ వారివి.. అది కూడా ఎమ్మెల్యే అదితి గజపతి ఫ్లెక్సీలు మాత్రమే ఉండాలని.. ఎన్నాళ్లయినా ఉండాలని ఒక అనధికార నిబంధన మున్సిపాలిటీలో జారీ అయిందని అంటున్నారు. ఇక మిగతావారివి ఎవరైనా ఫ్లెక్సీ పెడితే కనీసం ఒక పూట కూడా కాకుండా డంపింగ్ యార్డులోకి చేర్చాలన్నది ఆదేశమట. ఆఖరుకు టీడీపీ పల్లకీ మోయడానికి పనికొచ్చే జనసేన, బీజేపీల బోయీలు.. వారి స్థానం మాత్రం పెద్ద చెరువు గట్టు మీదనే అని తెలుగుదేశం నాయకులు చెప్పకనే చెబుతున్నారు.