
మరో నాలుగు బార్లకు అనుమతి
విజయనగరం రూరల్: జిల్లాలో మరో నాలుగు బార్లకు అనుమతి మంజూరైంది. నూతన బార్ పాలసీ ప్రకారం కొత్త బార్లు ఏర్పాటు కోసం కలెక్టరేట్‌లో గురువారం లాటరీ తీశారు. ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ రామసుందర్‌రెడ్డి పాల్గొని, ఆయన చేతులమీదుగా లాటరీ తీయించారు. జిల్లా వ్యాప్తంగా 31 బార్లు ఉండగా, వాటిలో 16 బార్లకు రెండు విడతల్లో లాటరీ ప్రక్రియ నిర్వహించి, లైసెన్స్ మంజూరు చేశారు. మిగిలిన 16 బార్లకు మూడో విడత కింద దరఖాస్తులు ఆహ్వానించగా గడువు ముగిసే సమయానికి నాలుగు బార్లకు 16 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు లాటరీ తీసి, కొత్త బార్లకు అనుమతులు ఇచ్చారు. దీని ద్వారా రూ.81.6 లక్షల ఆదాయం ఎకై ్సజ్ శాఖకు ఆదాయం లభించినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు.
లారీ ఢీకొని రెండు ఎద్దుల మృతి
సీతానగరం: మండలంలోని జాతీయ రహదారిపై గురువారం లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో రెండు ఎద్దులు మృతి చెందగా రైతుకు స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెల్లవారుజామున సుమారు 5.30 గంటల జగ్గునాయుడుపేట గ్రామం నుంచి ఇసుక తీసుకుని వెళ్లడానికి సీతానగరానికి రెండు నాటు బళ్లు వస్తుండగా అదే సమయంలో పార్వతీపురం నుంచి బొబ్బిలి వెళ్తున్న లారీని డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్ల ఎదురుగా రెండు నాటుబళ్లను లారీ ఢీకొట్టింది. దీంతో ముందు నాటు బండి తోలుతున్న రెడ్డి తిరుపతిరావుకు చెందిన ఒక ఎద్దు, రెండవ నాటు బండి తోలుతున్న పెంట పోలీనాయుడుకు చెందిన ఒక ఎద్దు సంఘటనా స్థలంలోనే మృతి చెందాయి. ముందు నాటుబండి తోలుతున్న రెడ్డి తిరుపతిరావుకు స్వల్ప గాయాలు కావడంతో పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. క్షతగాత్రుడు తిరుపతిరావు ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● ఆగిపోయిన ఇంజినీరింగ్ విద్యార్థి గుండె
విజయనగరం క్రైమ్: పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఉద్దవోలుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సాయికిరణ్ పరుగు పెడుతుండగా అకస్మాత్తుగా గుండె ఆగిపోయి మృతిచెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న సాయికిరణ్ ఎన్‌సీసీపై ఇష్టంతో కాలేజీలో గురువారం జరిగిన ఎంపికల్లో పాల్గొన్నాడు. ఈ ఎంపికలో భాగంగా 1.6 కిలోమీటర్ల పరుగులో సాయికిరణ్ పరుగెత్తి ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే కళాశాల యాజమాన్యం, ఎన్‌సీసీ సిబ్బంది, విద్యార్థి వివరాలు కనుక్కుని..పేరెంట్‌సను సంప్రదించి హుటాహుటిన ప్రభుత్వం హాస్పిటల్‌కు తీసుకువెళ్లడంతో వైద్యులు చికిత్స చేస్తుండగా సాయికిరణ్ మృతి చెందాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సాయికుమార్ తండ్రి పోలినాయుడు ఎన్నో ఆశలతో తన కొడుకును ఇంజినీరింగ్ చదివించి ఉన్నతస్థానంలో చూడాలనుకున్న ఆయన ఆశలు ఆవిరయ్యాయి. మృతుడికి తల్లి సుజాత, తండ్రి పోలినాయుడు, వివాహమైన, సోదరి శ్రావణి ఉన్నారు.
21న అండర్ 14 క్రికెట్ జట్టు ఎంపిక
విజయనగరం: ఈనెల 21న అండర్–14 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు (రాంబాబు) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాబా మెట్ట శివారు విజ్జి స్టేడియంలో ఆదివారం ఉదయం 7 గంటలకు ఎంపికలు నిర్వహిస్తామన్నారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు 2011 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు వారి సొంత క్రికెట్ కిట్టు, ఒరిజినల్ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, మూడేళ్ల స్టడీ సర్టిఫికెట్స్ తీసుకురావాలని, అలాగే తెలుపు దుస్తులు ధరించి రావాలని స్పష్టం చేశారు.

మరో నాలుగు బార్లకు అనుమతి

మరో నాలుగు బార్లకు అనుమతి