
రాములోరికి ‘పవిత్రాల సమర్పణ’
● మంగళవాయిద్యాలతో వైభవంగా
పట్టు పవిత్రాల ఊరేగింపు
● అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం
● నేడు స్వామివారికి పట్టాభిషేక మహోత్సవం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారికి పట్టు పవిత్రాల సమర్పణ కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. వేకువజామున ప్రాతఃకాలార్చన పూజలనంతరం మంగళాశాసనం, తీర్థ గోష్ఠి కార్యక్రమాలను జరిపించారు. పారాయణాలు, జపాలు, హవనాలు నిర్వహించి అష్ట కలశ స్నపన మహోత్సవాన్ని జరిపించారు. అనంతరం దేవస్థానం అర్చకులు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వేద ఋత్విక్కుల ఆధ్వర్యంలో పట్టు పవిత్రాలను మంగళవాయిద్యాల నడుమ దేవస్థానం వెలుపల ఊరేగించి సీతారామస్వామికి సమర్పించారు. పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, శాంతి కల్యాణంతో పాటు పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించనున్నామని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్, వరప్రసాద్, రామగోపాల్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

రాములోరికి ‘పవిత్రాల సమర్పణ’