
జిల్లాలో డోలీ మోతలు ఉండరాదు
● వైద్యసేవలు ప్రజలకు మరింత
చేరువ కావాలి
● కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఎక్కడా డోలీమోతలు ఉండరాదని, వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. అంబులెన్సు సర్వీస్ సేవలు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. కేపీఐ డాష్ బోర్డు తరచూ మోనటరింగ్ చేయాలని, గర్భిణుల నమోదు తప్పనిసరి చేయాలన్నారు. మలేరియా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థల లక్ష్యాలు, ప్రగతిపై ఆరా తీశారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ ఎస్.భాస్కరరావు, డీసీహెచ్‌ఎస్ జి.నాగభూషణరావు, వైద్యాధికారులు నాగశివ జ్యోతి, ఎం.వినోద్‌కుమార్, పి.జగన్‌మోహన్‌రావు, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు ఎం.సుధారా ణి, కె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.