
విద్యుత్ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలి
● విద్యుత్ జేఏసీ చైర్మన్ లక్ష్మణ్
విజయనగరం ఫోర్ట్: విద్యుత్ ఉద్యోగులకు ఇవ్వా ల్సిన నాలుగు డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విద్యుత్ జేఏసీ చైర్మన్ సురగాల లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈపీఎఫ్, జీపీఎఫ్ అమలుచేసి అందరికీ పెన్షన్ సదుపాయం కల్పించాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బండారు రాజేష్‌కుమార్, పప్పల అప్పలస్వామినాయుడు, నిర్మలామూర్తి, అప్పలనాయుడు, సీతారామరాజు పాల్గొన్నారు.