వైద్య విద్యపై ప్రైవేటు | - | Sakshi
Sakshi News home page

వైద్య విద్యపై ప్రైవేటు

Sep 17 2025 9:08 AM | Updated on Sep 17 2025 9:08 AM

వైద్య విద్యపై ప్రైవేటు

వైద్య విద్యపై ప్రైవేటు

వైద్య విద్యపై ప్రైవేటు

తమ బాధ్యత నుంచి

తప్పుకుని, ప్రైవేటుకు..

సాక్షి, పార్వతీపురం మన్యం: తమ బిడ్డలను డాక్టర్‌ చదివించాలని తల్లిదండ్రులు కలలుగంటారు. ఆ కల అందరికీ నెరవేరదు. వైద్య విద్యకు రూ.కోట్లలో ఖర్చు చేయాల్సి రావడమే అందుకు కారణం. పార్వతీపురం మన్యం వంటి వెనుకబడిన జిల్లాలో, ఏజెన్సీ ప్రాంతంలో పేదలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. వైద్యం కూడా ఖరీదు కావడమే ఇందుకు కారణం. అటు పేద పిల్లలకు వైద్య విద్యను చేరువ చేయడం.. ఇటు నిరుపేదలకు కూడా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సదుద్దేశంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా రూ.600 కోట్లతో వైద్యకళాశాల నిర్మాణానికి పరిపాలనాపరమైన ఆమోదం లభించింది. కురుపాం నియోజక వర్గం ఉల్లిభద్రలో 50 ఎకరాల స్థలాన్ని కూడా అప్పట్లో పరిశీలించారు. తర్వాత ప్రభుత్వం మారడంతో సీన్‌ మొత్తం రివర్స్‌ అయ్యింది.

చిన్నపాటి సమస్యకూ కేజీహెచ్‌నే దిక్కు

జిల్లాలో 99 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బడుగు వర్గాలకు చెందివారే. ఇక్కడ ప్రధాన ఆస్పత్రితోపాటు, మూడు ఏరియా ఆస్పత్రులు, 37 పీహెచ్‌సీలు, మూడు సీహెచ్‌సీలు ఉన్నాయి. ఒక్క జిల్లా ఆస్పత్రిలోనే రోజుకు 500కుపైగా ఓపీ నమోదవుతోంది. పీహెచ్‌సీల్లోనూ 200 నుంచి 300 వరకు ఓపీ ఉంటోంది. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా ఆస్పత్రి ఒక్కటే దిక్కవుతోంది. అక్కడ కూడా కొన్ని రకాల సేవలు అందడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో విజయనగరం, విశాఖ ప్రాంతాలకు రోగులు వెళ్తున్నారు. సరైన సదుపాయాలు లేక, చిన్నపాటి కేసులను కూడా వైద్యులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు, విశాఖ కేజీహెచ్‌కు రిఫర్‌ చేస్తున్నారు. ఇది రోగులకు, వారి బంధువులకు వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. అంత దూరం వెళ్లేలోగా మార్గమధ్యంలో ప్రాణాలు గాలిలో కలసిపోతున్న సందర్భాలు అనేకం.

పేదలకు మెరుగైన వైద్యం, విద్య అందించాలన్న సంకల్పంతో నాటి ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్‌ కళాశాలను కూటమి ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం, నిర్వహణను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే పార్వతీపురం మన్యం జిల్లాకు గత ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ టెండర్లను కూడా రద్దు చేసింది. దీనిపై అన్ని వర్గాల నుంచి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి గత ప్రభుత్వం రాష్ట్రంలో 17 కళాశాలను మూడు దశల్లో పూర్తి చేయాలని భావించింది. అందులో మన్యం జిల్లా కూడా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక.. తన బాధ్యత నుంచి తప్పుకొని.. పీపీపీ విధానంతో వైద్య కళాశాల ప్రైవేటీకరణకు పూనుకుంటున్నారు. ప్రైవేట్‌ వ్యక్తులకు ఇస్తే బాగా నడుపుతారని సర్ది చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం కాక, బయట వారికి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే.. పేదలకు ఉచిత విద్య, వైద్యం ఎలా అందిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ముడుపులకు ఆశ పడి, మెడికల్‌ మాఫియాను ప్రోత్సహించడం కోసమే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ విధానం ప్రకారం.. వైద్య విద్యను అందించి డాక్టర్లను తయారు చేయడమే కాదు.. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు జిల్లా వాసులకు ఉచితంగా అందించడం. పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందుతుంది.

ప్రైవేటుకే ప్రభుత్వ వైద్య కళాశాల

పేదల ఆరోగ్యంతో కూటమి చెలగాటం

ముడుపుల కోసం కక్కుర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement