
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం
సీతంపేట/కురుపాం: ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు సంపతిరావు కిశోర్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్, కోశాధికారి రెడ్డి మోహన్‌రావు స్పష్టంచేశారు. యూటీఎఫ్ రెండోరోజు రణభేరి బైక్‌జాతాను సీతంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కురుపాం మండంలోని నీలకంఠాపురంలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు, పీఆర్‌సీ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు డి.ప్రకాషరావు, ఆరిక భాస్కరరావు, కె.కృష్ణారావు, పి.కృష్ణారావు, పైడిరాజు, ఎన్.శ్రీరాములు, బి.కూర్మారావు, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం