
స్వయం సంపాదన మార్గాల పెంపునకు భరోసా
భామిని: గిరిజనుల స్వయం సంపాదన మార్గాలు పెంచేందుకు కృషిచేస్తానని పాలకొండ సబ్‌కలెక్టర్, సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. నీతి ఆయోగ్ ఆశావాహ గ్రామంగా ఎంపికై న భామిని మండలంలోని మనుమకొండ ఆదివాసీ గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. గిరిజనుల సమస్యలపై చర్చించారు. మహిళలకు పుట్టగొడుగుల పెంపకం, పురుషులకు చేపల పెంపకంపై అవగాహన కల్పిస్తామన్నారు. వీడీవీకేల్లో తయారుచేసే పసుపు, పేపర్ ప్లేట్లకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రం సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. భామిని ఏకలవ్య మోడల్ స్కూల్‌ను సందర్శించి విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. ఈఎంఆర్‌ఎస్ చుట్టూ ప్రహరీ నిర్మించాలని ఈఈ రమాదేవిని ఆదేశించారు. బత్తిలి పీహెచ్‌సీని సందర్శించి ప్రసవ సేవల తీరును వైద్యులు కొండపల్లి రవీంద్ర, దామోదరరావులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, ఎంపీడీఓ రజినీకాంత్, తహసీల్దార్ శివన్నారాయణ, ఏఈ అలికాన సందీప్, సీడీపీఓ శాంతిభవానీ ఉన్నారు.

స్వయం సంపాదన మార్గాల పెంపునకు భరోసా