
వైఎస్సార్‌సీపీ సీనియర్ కార్యకర్త మృతి
● సంతాపం తెలియజేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర
పాచిపెంట: మండలంలోని పాంచాలి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ కార్యకర్త కేతవరపు గణేశ్వర రావు(80) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్య మంత్రి పీడికరాజన్నదొర పాంచాలి గ్రామానికి వెళ్లి గణేశ్వరరావు భౌతికాయాన్ని దర్శించి సంతాపం తెలియజేశారు. మతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. రాజన్న దొర వెంట వైఎస్సార్‌సీపీ మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
గణేశ్వరరావు భౌతికాయం వద్ద
సంతాపం తెలియజేస్తున్న మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర