
కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల నిరసన
పార్వతీపురం రూరల్: ఏపీటీఎఫ్ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు వారం రోజుల నిరసనలో భాగంగా మంగళవారం పార్వతీపురం జిల్లాలో ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన వ్యక్తంచేశారు. ఈ నిరసనలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేష్, నల్ల బాలకృష్ణ రావు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బకాయిపడిన కరువు భత్యాన్ని ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. అలాగే 12వ పీఆర్‌సీని నియమించాలి. ఉద్యోగులకు ఆరోగ్య పథకం ద్వారా చికిత్స చేయడానికి నగదు పరిమితిని రూ.25లక్షకు పెంచాలి. కంట్రిబ్యూటరీ పింఛన్ పథకాన్ని విధానంలోకి తీసుకురావాలని నూతనంగా ప్రవేశపెట్టిన అసెస్‌మెంట్ బుక్ విధానాన్ని రద్దుచేయాలని బోధనేత కార్యక్రమాల నుంచి ఉపాధ్యాయులను మినహాయింపు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన మెమొరాండాన్ని డీఆర్‌ఓ కె.హేమలతకు అందజేశారు. కార్యక్రమంలో కొమరాడ, వీరఘట్టం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల నిరసన