
వైద్యసేవలు గగనమే...
వైద్య సేవలు గగనం అవుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. పీహెచ్‌సీల్లో వైద్య సిబ్బంది కొరత వేధిస్తుంది. కొన్ని పీహెచ్‌సీల్లో ఒక్కో డాక్టర్‌తోనే నెట్టుకొస్తున్నారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు సక్రమంగా జరగడం లేదు. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో జ్వర పీడితుల సంఖ్య తగ్గడం లేదు. ఏరియా ఆసుపత్రులు, పీహెచ్‌సీల పరిధిలో ఓపీ రోజురోజుకు పెరుగుతుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 250కి పైగా మలేరియా పాజిటివ్ కేసులు నమోదైందంటే పరిస్థితి ఎలా ఉందో అవగతమౌతుంది. గత నాలుగేళ్లుగా పోల్చితే ఇప్పుడు రోగుల సంఖ్య పెరిగింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2లక్షలకు పైగా దోమ తెరలను గిరిజన ప్రాంతాల్లో పంపిణీ చేశారు. అటు తర్వాత పంపిణీ లేదు.