
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
పాలకొండ రూరల్: ఈనెల 24 నుంచి 28 వరకూ ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సంబంఽధించిన జిల్లా జట్టు ఎంపిక ఆదివారం పాలకొండలో జరిగింది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణంలో జరిగిన ఈ ఎంపిక పోటీలకు జిల్లా పరిధిలో 15 మండలాలకు చెందిన 20 ఏళ్ల లోపు ఔత్సాహికులు హాజరయ్యారు. జూనియర్ విభాగానికి చెందిన ఎంపికలో బాలురు 70 మంది, బాలికలు 50 మంది ప్రతిభ కనబర్చారు. తుది జట్టులో 14 మంది వంతున రెండు జట్లను బాల,బాలికల నుంచి ఎంపిక చేశారు. అత్యంత ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ సంఘం గౌరవ అధ్యక్షుడు పల్లా కొండలరావు, అధ్యక్షుడు కోడి సుదర్శనరావు, కార్యదర్శి వెన్నపు చంద్రరావు(శేఖర్) తదితరులు తెలిపారు.