
అడ్డాకుల గూడలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని అడ్డాకుల గూడలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు శుక్రవారం ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. ‘అడ్డాకులగూడను వణికిస్తున్న కిడ్నీ భూతం’ శీర్షికన జూలై 24న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన వైద్య, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అదే నెల 25న గ్రామాన్ని సందర్శించారు. వైద్య తనిఖీలతో పాటు నీటి పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా రాగోలు జెమ్స్ ఆస్పత్రికి చెందిన నెఫ్రాలిజిస్ట్ డాక్టర్ గిరి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయపార్వతి, కుశిమి పీహెచ్‌సీ వైద్యాధికారి చాందినిలతో కూడిన వైద్యబృందం వైద్యశిబిరం నిర్వహించి రక్తపరీక్షలు చేశారు. వీరిలో కిడ్నీవ్యాధితో బాధపడుతున్న 8 మందిని గుర్తించి శనివారం ప్రత్యేక వాహనంలో జెమ్స్‌కు తరలిస్తామని వైద్యాధికారి చాందిని తెలిపారు. అక్కడ ఉచితంగా కిడ్నీ పరీక్షలు చేయనున్నారు. వ్యాధి నిర్ధారణ అనంతరం ప్రత్యేక వైద్యసేవలు అందిస్తామని వైద్యాధికారులు చెప్పారు.
జెమ్స్ నెఫ్రాలిజిస్టులతో వైద్య పరీక్షలు
8 మంది రోగుల గుర్తింపు
ఉచిత వైద్యసేవల కోసం జెమ్స్‌కు తరలింపు

అడ్డాకుల గూడలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు

అడ్డాకుల గూడలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు