
ఇన్ని కష్టాలా బాబూ..!
యూరియా కోసం
యూరియా కోసం రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. పొలం పని మానుకుని పీఏసీఎస్‌లు, ప్రైవేటు దుకాణాలు, ఆర్‌ఎస్‌కేలకు పరుగుతీస్తున్నారు. రోజంతా మండుటెండలో నిరీక్షిస్తున్నారు. పస్తులతో ఎరువు కోసం పాట్లు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నంపెట్టే రైతన్నల ఎరువు కష్టం చూసి సభ్యసమాజం తలదించుకుంటోంది. కూటమి ప్రభుత్వ తీరును దుయ్యబడుతోంది. డబ్బులిచ్చి కొనుగోలు చేసే ఎరువు కోసం ప్రైవేటు దుకాణాల వద్ద పడిగా పులు కాయడాన్ని చూసి నివ్వెరపోతోంది. ఎరువుకోసం రైతన్నలకు ఇన్నికష్టాలా ‘బాబూ’ అంటూ నిట్టూర్చుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో రైతన్న ఎరువు పాట్లుకు శనివారం కనిపించిన ఈ దృశ్యాలే సజీవసాక్ష్యం.