
రైతన్న ఎరువు సమస్యపై కూటమి మొద్దునిద్ర
● పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు
తీవ్రమైన ఎరువు కొరతతో రైతులు సమస్యల్లో ఉంటే కూటమి సర్కార్ మొద్దు నిద్ర వీడడంలేదని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. స్థానిక నాయకులతో కలిసి తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో ‘ఎరువుల బ్లాక్‌మార్కెట్‌పై అన్నదాత పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 9న పార్వతీపురం సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న కార్యక్రమానికి రైతులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. రైతులు ఎరువుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడితే దాన్ని బఫే భోజనంతో పోల్చిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్వతీపుం మున్సిపల్ చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సత్యనారాయణ, అధికార ప్రతినిధి ఎం.సత్యంనాయుడు, పార్టీ నాయకులు ఎస్. శ్రీనివాసరావు, షేక్‌షఫీ, బి.రవికుమార్, మజ్జి శేఖర్, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఎస్.లావణ్య, టి.బోదయ్య, వై.త్రినాథ, వి.నేతాజీ, నాగరాజు, కోరాడ చిట్టి పాల్గొన్నారు.