
శాఖాపరంగా సిబ్బంది సమస్యల పరిష్కారం
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన కార్యాలయంలో జూమ్ సమావేశం ద్వారా పోలీస్ వెల్ఫేర్‌డే (గ్రీవెన్స్‌డే)కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు పోలీస్‌శాఖ ప్రధాన కార్యాలయాలు, స్టేషన్ల అధికారులతో ఒక్కొక్కరి జూమ్ సమావేశం ద్వారా సమస్యలను తెలుసుకుని వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి అవకాశం ఉన్న వాటిని త్వరితగతిన పరి ష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఎస్‌బీ సీఐ రంగనాథం, సైబర్ సెల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ రమేష్, ఏఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, ఏఓ సతీష్, సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, శంకరరావు, సీసీ సంతోష్, డీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి