నేడు ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేడు ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు

Aug 7 2025 9:42 AM | Updated on Aug 7 2025 9:42 AM

నేడు

నేడు ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు

పార్వతీపురం రూరల్‌: జిల్లా కేంద్రాస్పత్రిలో గురువారం క్యాన్సర్‌కు ఉచిత స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసా ద్‌ తెలిపారు. విశాఖపట్నం మహాత్మా గాంధీ క్యాన్సర్‌ హాస్పిటల్‌ సౌజన్యంతో జిల్లా ఆస్పత్రి లో ఉచిత స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశామని పేర్కొంటూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 7వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత స్క్రీనింగ్‌ జరుగుతుందని, ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సీ్త్ర, పురుషులకు విభాగాల్లో నిర్వహిస్తారని ముఖ్యంగా, సీ్త్రలకు గైనిక్‌, రొమ్ము, గర్భాశయ, ఇతర క్యాన్సర్‌లకు స్క్రీనింగ్‌ చేయనున్నారని పేర్కొన్నారు.

అగ్రిగోల్డ్‌ భూముల పరిశీలన

కొమరాడ: మండలంలోని చోళపదం, ఉలిపిరి గ్రామాల్లోని అగ్రిగోల్డ్‌ భూములను పార్వతీపు రం సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీ వాస్తవ సంబంధి త కమిటీ సభ్యులతో కలిసి బుధవారం పరిశీలించారు. కొమరాడ తహసీల్దార్‌ సత్యనారా యణ భూముల పరిస్థితిని వివరించారు. మూ డు ఎల్‌పీఎంలలో దాదాపు తొమ్మిది వందల చెట్లను లెక్కించామన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మ్యుటేషన్‌, చెట్లగణన త్వరగా పూర్తిచేయాలని ఈ సందర్భంగా నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోభిక సంబంధిత అధికారులను ఆదేశించారు.

పార్వతీపురం మున్సిపల్‌

కమిషనర్‌ సరెండర్‌

సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపు రం మున్సిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌ వెంకటేశ్వర్లుపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మేనేజ ర్‌ హోదా గల ఆయన.. కూటమి నేతలతో ఉన్న సాన్నిహిత్యం కార ణంగా పుర కమిషనర్‌గా చలామణి అవుతున్న విషయం విదితమే. కూటమి ప్రభుత్వంపై స్వామి భక్తి చాటుకోవడమే కాక.. అవినీతి అధికారిగానూ ముద్ర పడ్డారు. పుర పాలకవర్గం విషయంలో ప్రోటోకాల్‌ పాటించకుండా, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకూ ఆహ్వానించక, కౌన్సిల్‌ సమావేశాల్లో కూటమి నేతలకు అనుకూలంగా ఉంటూ, ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు.. ప్రతి పనికీ ఒక రేటు కట్టేశారని, సొంత ఉద్యోగులను సైతం వదలకుండా ఇబ్బంది పెట్టేవారిని బహిరంగంగానే విమర్శలు వచ్చా యి. కొన్నాళ్లుగా కమిషనర్‌ వెంకటేశ్వర్లుకు.. మున్సిపల్‌ ఉద్యోగులకు మధ్య యుద్ధమే సాగింది. దీనిపై ఉద్యోగులు స్థానిక ఎమ్మెల్యే తో పాటు, కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ఇటీవల కార్యాలయానికి వచ్చిన మున్సిపల్‌ ఆర్డీకి కూడా పురపాలక సంఘం చైర్పర్సన్‌, వైస్‌ చైర్మన్లు, వైఎస్సార్‌సీపీ సభ్యులతో పాటు పలువురు పట్టణ వాసులు కమిషనర్‌ తీరుపై ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఆయనను సరెండర్‌ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. తదుపరి పోస్టింగ్‌ కోసం మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయానికి నివేదించాలని ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు.

133 కేజీల గంజాయి పట్టివేత

ఇద్దరి అరెస్టు

సాలూరు రూరల్‌: గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిలో బుధవారం ఉదయం అక్రమంగా తరలిస్తున్న 133 కేజీల గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు ఏఎస్పీ అంకిత సురానా తెలిపారు. ఈ మేరకు ఆమె సాలూరు రూరల్‌ పోలీస్‌ స్టేన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. పాచి పెంట మండలం మాతుమూరు సమీపంలో వేటగాని వలస గ్రామం గ్రీన్‌ఫీల్డ్‌ జంక్షన్‌ వద్ద పోలీసులు గంజాయితో పాటు నిందితులను పట్టున్నట్లు తెలిపారు.

ఈ కేసులో ఆటోతోపాటు ఇద్దరు నిందితులు కొర్ర డానియల్‌, జన్ని దివారకర్‌లను అరెస్టు చేశామన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో రూరల్‌ ఎస్సై నరసింహమూర్తి, పాచిపెంట ఎస్సై పాల్గొన్నారు.

నేడు ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు1
1/2

నేడు ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు

నేడు ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు2
2/2

నేడు ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement