
● మద్యం జోరు.. జనం బేజారు!
ఇప్పుడు ఏ పల్లె, పట్టణం, వీధిలో అయినా మద్యం విచ్చలవిడిగా లభిస్తోంది. బహిరంగ మద్యపానం యథేచ్ఛగా సాగుతోంది. ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది. వివాదాలకు కారణంగా మారుతోంది. వీటిని కట్టడిచేసేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. బొబ్బిలి సీఐ కె.సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది డ్రోన్ కెమెరాలతో పలు ప్రాంతాలను చిత్రీకరించగా టీబీఆర్ థియేటర్ ప్రాంతంలో కాలువ గట్టుపై బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని గుర్తించారు. వెంటనే పోలీసులను పంపించి వారిని పట్టుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, మద్యం సేవించి వాహనాలను నడిపినా కేసులు
నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. – బొబ్బిలి