
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫాం నంబర్ 5పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం జీఆర్పీ సిబ్బంది గమనించారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 ఉంటుందని సుమారు ఆరడుగుల ఎత్తు, సిమెంట్ రంగు షర్ట్ , నీలిరంగు ఫ్యాంట్ ధరించిన వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నామని జీఆర్పీ హెచ్‌సీ అశోక్ తెలిపారు. మృతుడి కుడి చేతికి ఎర్రటి తాడు ఉందని సదరు వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే ఫోన్ 9490617089, 6301365605 నంబర్లకు కానీ ల్యాండ్ లైన్ 08912883218 నంబర్‌కు కానీ ఫోన్ చేయాలని హెచ్‌సీ అశోక్ తెలిపారు.